ఈరోజుల్లో వ్యాపారులు డిఫరెంట్ బిజినెస్ స్ట్రాటెజీ( Business Strategies )లతో ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నారు.వీరి క్రియేటివిటీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తరచుగా వైరల్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా ఒక పైనాపిల్( Pineapple ) విక్రేత తన వ్యాపారం పట్ల అంకితభావంతో ఒక అద్భుతమైన మార్కెటింగ్ వ్యూహంతో వార్తల్లో నిలిచాడు.తన పండ్ల అమ్మకాలను పెంచుకోవడానికి, తన స్టాల్ వైపు ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఏదైనా ప్రత్యేకమైన పని చేయాలని ఈ వ్యక్తి నిర్ణయించుకున్నాడు.
చివరికి అతను ఏం చేశాడంటే… పైనాపిల్ ఆకారంలో తన జుట్టు( Pineapple Hair Style )ను కత్తిరించుకున్నాడు! పైనాపిల్ చర్మంలా, జుట్టు పైభాగంలో ముళ్లు, దిగువన చిన్న చిన్న గీతలు ఉండేలా కత్తిరించుకున్నాడు.
పైనాపిల్ పసుపు రంగును పోలి ఉండేలా తన జుట్టును కూడా రంగు వేసుకున్నాడు.ఈ పైనాపిల్ విక్రేత వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయింది.అతను తన పండ్ల స్టాల్ వెనుక కూర్చున్నట్లు చూపించే ఈ వీడియోలో, అతని అసాధారణమైన కేశాలంకరణ స్పష్టంగా కనిపిస్తుందిఈ తెలివైన వ్యాపార వ్యూహానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు కూడా.
తాను అమ్ముతున్న పండు రూపాన్ని తనలో ప్రతిబింబించడం ద్వారా, ఈ విక్రేత కస్టమర్ల మనసులో ఒక చిరస్మరణీయ చిత్రాన్ని సృష్టించాడని అంటున్నారు.
అతని క్రియేటివ్ మార్కెటింగ్ స్ట్రాటెజీ( Creative Marketing Strategy )కి ప్రజల ప్రశంసలు కురిపిస్తున్నారు.తన పని పట్ల అతని అంకితభావం, పోటీ నుండి నిలదొక్కుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలు ఆన్‌లైన్ కమ్యూనిటీల నుండి అతనికి ప్రశంసలు తెచ్చిపెట్టాయి.వీడియోపై చాలామంది ఫన్నీ కామెంట్ చేశారు మరి కొందరు అతని క్రియేటివిటీకి హాట్సాఫ్ అని చెప్పారు.
ఇలాంటి ఐడియా రావడం నిజంగా గ్రేట్ అని మరికొందరు ప్రశంసించారు.