7 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ దేవాలయానికి భక్తుల క్యూ..
TeluguStop.com
ఖర్సాలీ గ్రామం ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లలో ఒకటైన యమునోత్రికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఈ గ్రామంలో శని దేవుడు,అతని సోదరి యమునల ఆలయం ఉంది.ఈ దేవాలయం వేసవిలోని వైశాఖి సందర్భంగా భక్తుల కోసం తెరుస్తారు.
ఏప్రిల్ 30న శని అమావాస్య.ఈ రోజున దేశవ్యాప్తంగా శని దేవాలయాల్లో భక్తుల రద్దీ ఉంటుంది.
ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ శని దేవుడి ఆలయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.వేసవి కాలంలో ఇక్కడికి రావడం చాలా ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది.
ఖర్సాలీలో శీతాకాలంలో మంచు కురుస్తుంది.ఈ కారణంగా ఈ శని దేవాలయం తలుపులు మూసివేస్తారు.
వేసవి ప్రారంభం కావడంతో భక్తులకు వాతావరణం అనుకూలంగా మారుతుంది.దీంతో భక్తులు శని దేవుడిని చూడటానికి సులభంగా ఇక్కడికి చేరుకుంటారు.
ఈ శని దేవాలయం ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లా ఖర్సాలీ గ్రామంలో సముద్ర మట్టానికి సుమారు 7 వేల అడుగుల ఎత్తులో ఉంది.
ఈ ఆలయం చాలా పురాతనమైనది.ఈ ప్రాంతీయులు తెలిపిన వివరాల ప్రకాచం శని దేవుడు తన సోదరి యమునను కలవడానికి ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు యమునోత్రిని సందర్శిస్తాడు.
"""/" /
యమునోత్రి నుండి శని దేవాలయం దాదాపు 5 కి.మీ.
దూరాన ఉంటుంది.యమునోత్రికి వచ్చే చాలా మంది భక్తులు శనిదేవాలయాన్ని సందర్శిస్తారు.
ఇక్కడి చరిత్ర మహాభారత కాలం నాటిదని నమ్ముతారు.ఐదుగురు పాండవులు తమ ప్రయాణ సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారంటారు.
ఈ ఆలయం ఐదు అంతస్తులతో ఉంది.రాతి, చెక్కతో దీనిని నిర్మించారు.
ఆలయంలో శని దేవుడి కాంస్య విగ్రహం ఏర్పాటు చేశారు.ఆలయంలో నిత్యం దీపం వెలుగుతూనే ఉంటుంది.
ఈ కాంతి మధ్య శనిదేవుని విగ్రహం కనిపిస్తుంది.
నాని హిట్3 సినిమాలో మరో స్టార్ హీరో కనిపించనున్నారా.. అసలేం జరిగిందంటే?