కొందరికి శరీరం మొత్తం నాజూగ్గా ఉన్న సరే పొట్ట వద్ద మాత్రం లావుగా ఉంటుంది.గంటల తరబడి కూర్చుని ఉండటం, మద్యపానం, ఫ్యాట్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ ను అధికంగా తీసుకోవడం, ప్రెగ్నెన్సీ తదితర కారణాల వల్ల బెల్లీ ఫ్యాట్( Belly fat ) సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే పొట్ట కొవ్వు ను కరిగించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.నిత్యం చెమటలు చిందేలా వర్కౌట్ చేస్తుంటారు.
కొందరికి మాత్రం బిజీ లైఫ్ స్టైల్ కారణంగా వర్కౌట్ చేసేంత సమయం ఉండదు.

అయితే వర్కౌట్ చేయకపోయినా పర్లేదు.ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజు మార్నింగ్ తీసుకుంటే బాన పొట్ట దెబ్బకు మాయం అవుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ఒక చిన్న క్యారెట్( Carrot ) ను తీసుకుని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అర కప్పు పైనాపిల్ ముక్కలు( Slices of pineapple ) కట్ చేసుకుని పెట్టుకోవాలి.
రెండు నుంచి మూడు ఉసిరికాయలు తీసుకుని గింజ తొలగించి పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉసిరికాయ ముక్కలు వేసుకోవాలి.
అలాగే అర అంగుళం పొట్టు తొలగించిన అల్లం ముక్కను ( ginger )కూడా వేసుకోవాలి.చివరిగా ఒక గ్లాస్ వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ తేనె కలిపితే మన ఫ్యాట్ కట్టర్ డ్రింక్ సిద్ధం అవుతుంది.ఈ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ ను రోజు ఉదయం తీసుకోవాలి.ఇలా నిత్యం చేస్తే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.బాన పొట్ట కొద్ది రోజుల్లోనే నాజూగ్గా మారుతుంది.అలాగే ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు సులభంగా బయటకు తొలగిపోతాయి.బాడీ డీటాక్స్ అవుతుంది.
వెయిట్ లాస్ అవుతారు.కంటి చూపు రెట్టింపు అవుతుంది.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు ఉన్నా సరే తగ్గు ముఖం పడతాయి.