వరంగల్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పర్యటించారు.ఇందులో భాగంగా ముందుగా భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్న ఆయన హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మైదానాన్ని సందర్శించారు.
ప్రధాని మోదీ సభ ఏర్పాట్లను పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.వరంగల్ కోటాలో నూతన లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.160 ఎకరాల్లో వ్యాగన్ ఫ్యాక్టరీకి ప్రధాని భూమి పూజ చేస్తారని చెప్పారు.ఫస్ట్ ఫేజ్ లో రూ.521 కోట్లతో రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మితమవుతుందని పేర్కొన్నారు.రాజకీయంగా వరంగల్ సభ కీలకమైనదన్న కిషన్ రెడ్డి కొందరు కావాలనే సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబ పాలనకు బీజేపీ చరమగీతం పాడుతుందని వెల్లడించారు.