ఆంధ్రప్రదేశ్లో బిజెపికి( BJP ) కొంత సానుకూలత ఉన్నఉన్న స్థానాలలో విశాఖపట్నం సీటు( Vishakapatnam ) కూడా ఒకటి 2014లో బిజెపి అభ్యర్థి హరిబాబు ఈ సీటును గెలుచుకున్నారు.దాంతో కొంత సంప్రదాయక ఓటు బ్యాంకు బిజెపికి ఇ క్కడ కొనసాగుతుంది.ప్రస్తుతం ఆ సీటుపై కన్నేసిన జీవీఎల్ నరసింహారావు( GVL Narasimha Rao ) గత రెండు సంవత్సరాలుగా కార్య క్షేత్రంలో బలంగా పనిచేస్తూ విశాఖ సీటుపై ఆశలు పెట్టుకున్నారు కేంద్రంలోని కీలక నేతలతో వ్యక్తిగత చనువు కూడా ఉన్న జీ వీ యల్ ఆ మేరకు విశాఖ సీటు పై వారి నుంచి హామీ పొందినందు వల్లే ఆయన సొంతంగా ఇల్లు కూడా విశాఖపట్నంలో నిర్మించుకున్నారని ఆయన రాజకీయ భవిష్యత్తుని విశాఖ కేంద్రంగా ఆయన నిర్మించుకుంటున్నారని వార్తలు వచ్చాయి
అయితే ఇప్పుడు మారిన సమీకరణాల రీత్యా అనూహ్యం గా పురందేశ్వరి( Purandeshwari ) సీనులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది.ఆమె కూడా విశాఖ ఎంపీ సీట్ పై గురిపెట్టారని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఏ సీటు నుంచి అయినా పోటీ చేసే అవకాశం తనకి ఉండటంతో ఆమె విశాఖ ఎంపీ సీట్లు కోరుకుంటున్నట్లుగా తెలుస్తుంది.అయితే ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన జీవీఎల్ తనకున్న పరిచయాలతో విశాఖ సీటును తనకే కేటాయించేలా తెరవెనక చక్రం తిప్పుతున్నారని ఆ దిశగా ఆయనకు కేంద్ర పెద్దలతో పాటు ఆర్ఎస్ఎస్ కీలక నేతల అండ కూడా ఉన్నందున విశాఖ సీటు జిబిఎల్దే అన్న విశ్లేషణలు వస్తున్నాయి .
అయితే రాష్ట్రంలో ఎదగాలనుకుంటున్న బిజెపి కీలక సామాజిక వర్గానికి చెందిన పురందేశ్వరికి అవకాశం ఇచ్చింది .ఇప్పుడు ఆమె కోరుకున్న సీటు ఇవ్వకపోతే వచ్చే ఇబ్బందులను కూడా పార్టీ పరిగణిస్తుందని ఆమెకు అనుకూలమైన సీటు కోసం పార్టీ కూడా అన్వేషిస్తుందని ప్రచారం జరుగుతుంది.అయితే మొదటి నుంచి నాన్ లోకల్ అభ్యర్థులను గెలిపిస్తున్న విశాఖ ఎంపీ సీటు అయితేనే తనకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్న పురందేశ్వరి ఆ దిశగా కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెస్తున్నారని ఇద్దరూ కీలకమైన నేతలు కావడం, భాజపా పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉండడంతో చివరివరకు ఈ సీటు విషయంలో సస్పెన్స్ మెయింటెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది