శుభవార్త చెప్పిన టెక్ దిగ్గజం.. ‘వేరియబుల్ పే’పై కీలక ప్రకటన!
TeluguStop.com
గడ్డు పరిస్థితుల మధ్య కూడా టెక్( Tech ) దిగ్గజం హెచ్‌సీఎల్ ( HCL )దుమ్ములేపింది.
ఈ క్రమంలో ఈ ఉద్యోగులు వేచిచూస్తున్న వేరియబుల్ పే ( Variable Pay )విషయంపై ఓ కీలక ప్రకటన చేసింది.
వేరియబుల్ పే అంటే మీకు తెలిసినదే.ఉద్యోగి పరిహారంలో ఒక భాగం.
ఇది కంపెనీ పనితీరు, వ్యక్తిగత ఉద్యోగుల పనితీరుపై నిర్ణయించబడి ఉంటుంది.గత ఏడాది ఇదే త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.
3,593 కోట్ల ఆదాయాన్ని నమోదు చేయగా.తాజా ఫలితాల్లో 10.
80 శాతం వృద్ధితో రూ.3,983 కోట్ల నికర ఆదాయాన్ని ఆర్జించడం విశేషం.
"""/" /
ఈ క్రమంలో హెచ్‌సీఎల్ క్యూ4 ( HCL Q4 )లో 85 శాతం మంది ఉద్యోగులకు వేరియబుల్ వేతనాన్ని చెల్లించాలని నిర్ణయించడం విశేషం.
ఇదే విషయాన్ని చీఫ్ పీపుల్ ఆఫీసర్ రామ్ సుందరరాజన్ ఎర్నింగ్ కాల్ సందర్భంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ Q4 FY23కి వేరియబుల్ పే మునుపటి త్రైమాసికాల మాదిరిగానే ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదే క్రమంలో కంపెనీ ఒక్కో షేరుకు రూ.18 డివిడెండ్ చెల్లించనున్నట్లు కూడా ప్రకటించారు.
"""/" /
అయితే ప్రస్తుత గడ్డు పరిస్థితులలో కొత్త నిమయకాలు స్పీడు తగ్గినట్లు వివరించారు.
గత సంవత్సరం నాలుగో త్రైమాసికంతో పోల్చిచూస్తే కొత్త నియామకాలు 57 శాతం తగ్గి 17,067గా నిలిచాయి.
అయితే.నియామకాల సంఖ్య గత క్యూ4లో 39,900గా ఉంది.
ఇక వ్యాపారం విషయానికి వస్తే.కంపెనీ పైప్‌లైన్ ఆల్-టైమ్ గరిష్ఠ స్థాయికి చేరుకుందని హెచ్‌సీఎల్ CEO విజయ్ కుమార్ వెల్లడించారు.
ఇది బలమైన క్లయింట్ డిమాండ్‌ను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు.పైగా ఆరోగ్యకరమైన రాబడి వృద్ధిని సాధించటానికి మార్జిన్లు సహాయంగా నిలుస్తాయన్నారు.
యూఎస్ మెయిల్ బాక్సులపై కుక్క కాలి గుర్తులు ఎందుకుంటాయో తెలుసా..