నేటి నుండి బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం అవ్వబోతున్న విషయం తెల్సిందే.నాగార్జున హోస్ట్ గా వరుసగా అయిదవ సారి ఈ సీజన్ కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
రెగ్యులర్ బిగ్ బాస్ మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా రెండవ సీజన్ కి నాని హోస్టింగ్ చేశాడు.మూడవ సీజన్ నుండి నాగార్జున వరుసగా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
సౌత్ లో అన్ని భాషల్లో కూడా బిగ్ బాస్ టెలికాస్ట్ అవుతోంది.అయితే సౌత్ లోని అన్ని భాషల్లోని హోస్ట్ ల కంటే కూడా అధిక పారితోషికం నాగార్జున కు దక్కుతున్నట్లుగా తెలుస్తోంది.
ఒక్క కాల్షీట్ కి కోటికి పైగానే నాగ్ పారితోషికంగా తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది.రికార్డు స్థాయి పారితోషికం తీసుకుంటున్న నాగార్జున ఈసారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ ను అందించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే మొన్నటి వరకు ఉదయభాను ఉంటుందని అంతా అన్నారు.కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఉదయ భాను ఈ సీజన్ లో లేదని తెలుస్తోంది.
ప్రస్తుతం కంటెస్టెంట్స్ విషయంలో రక రకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంట్రీ ఇవ్వబోతున్న కంటెస్టెంట్స్ చాలా విభిన్నంగా.అన్ని వర్గాలకు చెందిన వారిగా కొత్త వారు కొందరు ఉండబోతున్నారు.

గతంలో కంటెస్టెంట్స్ విషయం లో ప్రేక్షకులు నిరాశ పర్చారు.కానీ ఈసారి మాత్రం స్టార్ మా మరియు షో నిర్వాహకులు కచ్చితంగా మంచి కంటెస్టెంట్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా కొంత మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారు అనుకుంటే వారు వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఇక జబర్దస్త్ చంటీ మరియు ఫైమా లు బిగ్ బాస్ లోకి వెళ్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.







