రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V.శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో ప్రముఖ కూచిపూడి నర్తకి, కాకతీయం పేరుతో ఎన్నో పరిశోధనలు చేసి, అద్భుతమైన ప్రదర్శనలు ఇస్తున్న శ్రీమతి పద్మజా రెడ్డి గారు ఇటీవలే పద్మ శ్రీ అవార్డు కి ఎంపికైన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీ V.శ్రీనివాస్ గౌడ్ గారు పద్మ శ్రీ అవార్డు కు ఎంపికైన శ్రీమతి పద్మజా రెడ్డి గారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో పద్మజా రెడ్డి గారి భర్త వ్యాపారవేత్త శ్రీనివాస్ రెడ్డి గారు పాల్గొన్నారు.