మెగాస్టార్ చిరంజీవి.తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాల్లో నటించాడు.
ఇప్పటికే తన కెరీర్ లో 150కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.వాటిలో స్టార్ హీరో కాక ముందే విభిన్న పాత్రలు చేసి మెప్పించాడు.స్టార్ హీరోగా ఎదిగాక మాస్ జనాలను టార్గెట్ చేసుకుని సినిమాలు చేశాడు. స్వయం క్రుషి, ఆరాధన లాంటి డీగ్లామర్ రోల్స్ చేశాడు.చంటబ్బాయ్ లాంటి కామెడీ రోల్ కూడా పోషించాడు.కానీ.
ఆరాధన, చంటబ్బాయ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.ఈ సినిమాలు పరాజయం పొందడం పట్ల చిరంజీవి కాస్త బాధ పడ్డాడట.
ఈ విషయంపై ఆయన ఓసారి స్పందించాడు కూడా.ఇంతకీ తనను ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం.

తాను నటించిన చాలా సినిమాల్లో సరికొత్త పాత్రలు పోషించినట్లు చిరంజీవి చెప్పాడు.అయితే వాటిలో కొన్ని సినిమాల్లో చేసిన క్యారెక్టర్లు ఎంత బాగున్నా.కొన్ని సినిమాలు గుర్తింపు పొందలేకపోయాయన్నాడు.అలా జరగడం బాధాకరమన్నాడు.సినిమా పరాజయం వెనుక పాత్రల లోపం ఉందని, పాత్రని సరిగా తీర్చిదిద్దలేకపోయారని తాను చెప్పలేనన్నాడు.అలాంటి పాత్రలను జనాలను అర్థం చేసుకోకపోవడమో.
లేదంటే జనాలను అర్థం చేసుకునేలా కన్విన్స్ చేయలేకపోవడమే జరుగుతుందన్నారు.

లేందంటే పెరిగిన తన ఇమేజ్ కారణంగా జనాలు ఆ పాత్రల్లో చూడలేకపోవడం కూడా ఓ కారణం కావొచ్చాన్నాడు.చిరంజీవి ఎప్పటికీ ఆల్ రౌండర్ గానే ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు.తన శక్తి వంచనలేకుండా ఆయా పాత్రలు పోషిస్తానని చెప్పాడు.
ప్రత్యేక గుర్తింపు కోసం తనలో చాలా తపన ఉందన్నారు.ఆ ప్రయత్నాల్లో తాను విజయం సాధిస్తానని చెప్పాడు.
కొన్నిసార్లు పరాజయం పాలైనా ఇబ్బంది పడేది లేదన్నారు.జనాలు మెచ్చే పాత్రలు చేసేందుకే తాను ప్రయత్నిస్తానని చెప్పాడు.

ప్రస్తుతం చిరంజీవి ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.ఆచార్య సినిమాతో జనాల ముందుకు రాబోతున్నాడు.అయితే కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం నిలిచిపోయింది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సగానికిపైగా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుస్తోంది.