మాజీ మంత్రి ఈటెల పై పరోక్ష యుద్దానికి టీఆర్ఎస్ రెడీ అవుతోంది.ఈటెలపై కాంగ్రెస్ పరోక్ష యుద్ధమెంటని ఆశ్చర్య పోతున్నారా.
ఇక అసలు విషయంలోకి వెళ్తే మాజీ మంత్రి ఈటెల రాజేందర్ మొట్ట మొదట కాంగ్రెస్ నాయకులతో భేటీ అయిన విషయం మనకు తెలిసిందే.అయితే ఆ భేటీ అయిన తరువాత ఈటెల కాంగ్రెస్ లో చేరుతున్నాడనే విషయం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చగా మారిన విషయం తెలిసిందే.
అయితే ఆ తరువాత ఆ వార్తలను ఖండించిన ఈటెల ఇక బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.అయితే హుజూరాబాద్ నియోజకవర్గం తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది . హుజూరాబాద్ లో కౌశిక్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉన్నా ఈటెల చేతిలో ఇప్పటి వరకు మోసపోతూనే ఉన్నారు.అయితే ఈటెల విషయంలో పరోక్ష యుద్దానికి దిగుతోంది.
అయితే స్వతంత్రంగా పోటీ చేస్తే ఈటెలకు మద్దతు ఉండేదని, బీజేపీలో చేరి తనకున్న గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నారని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చి ఈటెలను పరోక్షంగా అడ్డుకుంటారనేది ఒక వ్యూహంలా కనిపిస్తోంది.
మరి ఏది ఏమైనా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.ఈటెల విషయంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరిస్తుందనేది చూడాల్సి ఉంది.