ఈ మధ్యకాలంలో జంతువులకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ సందడి చేస్తున్నాయి.తాజాగా ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.
సముద్రంలో అనేక జంతువులు, జీవరాశులు ఉంటాయి.వాటిలో కొన్ని కొన్నిటికి ఆహారం అవుతాయి.
తాజాగా అలాంటి వీడియోనే ఓ పక్షికి సంబంధించినది వైరల్ అవుతోంది.సముద్రంలోని చేపలు ఒకరికి చిక్కితే దాని ప్రాణాలు కాపాడుకోవడం చాలా కష్టం.
అయితే ఇక్కడ ఒక చేప చాలా సులభంగా తప్పించుకుంది.ప్రాణాలను కాపాడుకుంది.
దాదాపు బాతు నోట్లోకి వెళ్లి మరీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి క్షణంలో నీటిలోకి జారిపోయింది.సరైన సమయస్ఫూర్తితో ఆ చేప తనను తాను దక్కించుకుంది.
వీడియోలో మనం ఓ నీటి బాతును చూడొచ్చు.ఆ నీటి బాతు సముద్రంలో వేటాడుతుంది.దాని నోటికి ఒక్కసారిగా చేప చిక్కింది.ఇక ఆహారం దొరికింది అనుకుని హాయిగా ఉన్న సమయంలో ఆకాశం నుండి డేగ చేపను దక్కించుకోవడానికి బాతు వద్దకు వచ్చింది.
ఆ సమయంలో బాతు నోట కరచుకొని ఉన్న చేపను జారవిడిచింది.చేప నీటిలోకి దూకింది.

తన ప్రాణాలను రక్షించుకుంది.చేపకు రెండు వైపులా ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ ఆ చేప తనను తాను రక్షించుకునే ప్రయత్నం చేసి విజయం సాధించింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ వీడియోకు లక్కీ ఫిష్ అని పేరుతో ట్యాగ్ చేశారు.దీనిని ఇప్పటికే చాలామంది చూసి కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం చేప వీడియో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.
రెండు వైపులా చేపను తినడానికి వస్తున్నా కూడా చేప తనను తాను రక్షించుకోవడానికి నీటిలోకి దిగింది.చేప చేసిన పనికి హ్యాట్సాప్ అంటూ చాలా మంది కామెంట్లు చేస్తున్నారు.
మరికొందరు తెలివైన చేప అంటూ పెడుతున్నారు.ప్రస్తుతం చేప వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.