ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఈ మధ్య కాలంలో వరుస వివాదాల ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.భర్త చేసిన తప్పులు శిల్పాశెట్టి కెరీర్ పై ప్రభావం చూపాయి.
రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల కేసులో అరెస్ట్ కావడంతో శిల్పాశెట్టితో కొన్ని కంపెనీలు గతంలో చేసుకున్న ఒప్పందాలను సైతం రద్దు చేసుకున్నాయి.అయితే తాజాగా శిల్పాశెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

భర్త రాజ్ కుంద్రాకు విడాకులు ఇవ్వాలని శిల్పాశెట్టి భావిస్తున్నట్టు సమాచారం.భర్తతో విడిపోయి పిల్లలతో కలిసి జీవనం సాగించాలని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.జులై నెల 19వ తేదీన అశ్లీల చిత్రాల కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్ కాగా పోలీసులు రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను కోర్టులో సమర్పించారు.తాజాగా రాజ్ కుంద్రా బెయిల్ పై విడుదలయ్యారు.
రాజ్ కుంద్రాను అరెస్ట్ చేయడంతో శిల్పాశెట్టితో పాటు ఆమె కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో అవమానాలను ఎదుర్కొంటున్నారు.
నెగిటివ్ కామెంట్లు, ట్రోలింగ్ వల్ల శిల్పాశెట్టి కొన్నిరోజుల పాటు ఆమె హాజరు కావాల్సిన షూటింగ్ లకు సైతం హాజరు కాలేదు.
తాజాగా శిల్పాశెట్టి సోషల్ మీడియాలో అందరూ తప్పులు చేస్తారని అయితే ఆ తప్పులు ఇతరులను బాధించే విధంగా భయంకరంగా ఉండకూడదని చెప్పుకొచ్చారు.అదే సమయంలో చేసిన తప్పులను తాను సరిదిద్దుకుంటానని శిల్పాశెట్టి పోస్టులు పెట్టడం గమనార్హం.

శిల్పాశెట్టి చేసిన కామెంట్ల వల్ల ఆమె భర్తతో విడిపోయే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాల ద్వారా సంపాదించిన డబ్బును సైతం ఉపయోగించకూడదని ఆమె భావిస్తున్నట్టు తెలుస్తోంది.పోలీసులు అరెస్ట్ చేసే వరకు శిల్పాశెట్టికి భర్త అశ్లీల చిత్రాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నట్టు తెలియదని శిల్పాశెట్టి సన్నిహితులు చెబుతున్నారు.అయితే విడాకుల గురించి వైరల్ అవుతున్న వార్తల విషయంలో శిల్పాశెట్టి స్పందించి స్పష్టతనివ్వాల్సి ఉంది.