కాజల్ అగర్వాల్ భర్త తో బీచ్ లో బాగానే ఎంజాయ్ చేస్తోందిగా... 

తెలుగు సినిమా పరిశ్రమలో దాదాపుగా సీనియర్ నుంచి జూనియర్ వరకు అందరి స్టార్ హీరోల సరసన నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ బ్యూటి “చందమామ కాజల్ అగర్వాల్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే అందరిలాగే సినిమా పరిశ్రమకు వచ్చిన మొదట్లో కాజల్ అగర్వాల్ కొంతమేర  ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ పట్టు విడవకుండా శ్రమించి అవకాశాలు దక్కించుకుని బాగానే రాణించింది.

 Kajal Aggarwal Enjoy With Her Husband Gautham Kitchlu In Maldives, Kajal Aggarw-TeluguStop.com

 అంతేగాక దాదాపుగా దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల సరసన వెలుగొందింది.

అయితే ఇటీవలే కాజల్ అగర్వాల్ ముంబై కి చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త “గౌతమ్ కిచ్లు” అనే వ్యక్తిని ప్రేమించి పెళ్ళి చేసుకుంది.

దీంతో ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి మాల్దీవ్స్ కి హనీమూన్ కి వెళ్ళింది.ఈ క్రమంలో తన భర్త గౌతమ్ కిచ్లు తో కలిసి బీచ్ లో దిగిన ఫోటోలని కాజల్ అగర్వాల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది.

దీంతో కాజల్ అగర్వాల్ అందానికి ఫిదా అయినటువంటి నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు.మరికొంతమంది అయితే నిండు నూరేళ్ళు తన భర్తతో కలిసి సంతోషంగా జీవించాలంటూ ఆశీర్వాదాలతో పాటు అభినందనలు కూడా తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళంలో ప్రముఖ విలక్షణ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్న “భారతీయుడు 2” చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది.అలాగే తెలుగులో మంచు వారి హీరో మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న “మోసగాళ్లు” అనే చిత్రంలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది.

  కాగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా థియేటర్లు మూత పడడంతో కొంత కాలం పాటు ఈ చిత్రం విడుదలను తాత్కాలికంగా వాయిదా వేశారు.కాగా కాజల్ అగర్వాల్ ఆమధ్య ప్యారిస్ ప్యారిస్ అనే చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించింది.

ఇప్పటికే ఈ చిత్రానికి సంబందించిన చిత్రికరణ పనులు పూర్తయినప్పటికీ కానీ ఎందుకో విడుదలకు నోచుకోలేక పోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube