క్షణం సినిమాతో మొదలయిన హీరో అడవి శేష్ విజయాల పరంపర .హిట్ 2 వరకు కొనసాగింది.
బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ రావడం తో పాటు రెండు డబల్ హ్యాట్రిక్స్ పడటం వల్ల అడవి శేష్ కెరీర్ గ్రాఫ్ పక్కాగా పెరిగింది.అంతే కాదు తీసిన అన్ని తీసిన సినిమాలు సస్పెన్స్ థ్రిల్లర్స్ కావడం తో అడవి శేష్ భిన్నమైన హీరో గా టాలీవుడ్ లో నిలబడ్డాడు.
మొదట్లో సొంతం వంటి సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ గా కనిపించి ఆ తర్వాత అమెరికా కి వెళ్ళిపోయి తిరిగి వచ్చాక కర్మ వంటి ఓన్ సినిమాతో వచ్చాడు.పంజా, బాహుబలి వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.
కిస్ సినిమా తో పూర్తి స్థాయి హీరో గా ఎదిగి క్షణం తో తొలి హిట్ ని తన ఖాతా లో వేసుకున్నాడు.మహేష్ బాబు వంటి స్టార్ హీరో సైతం అడవి శేష్ పై నమ్మకంతో మేజర్ సినిమా కోసం హీరోగా తీసుకున్నాడు.
ఈ చిత్రం కూడా మంచి విజయం సాధించింది.ఇక బాలీవుడ్ ఆఫర్స్ సైతం అడవి శేష్ కోసం క్యూ కడుతున్నాయి.కేవలం హీరోగా మాత్రమే కాదు కథలు కూడా తానే రాసుకుంటూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం మార్కెట్ లో అడవి శేష్ అంటే ఒక బ్రాండ్ లాగ మారిపోయాడు.
అంతే కాదు అతడొక మినిమమ్ గ్యారంటీ హీరో గా కూడా ప్రొడ్యూసర్స్ కి వరం లా కనిపిస్తున్నాడు.అందుకే సక్సెస్ పడ్డ ప్రతి సారి అతడి కెరీర్ గ్రాఫ్ తో పాటు రెమ్యునరేష్ గ్రాఫ్ కూడా పెరుగుతూ వెళ్తుంది.
ప్రస్తుతం హిట్ 2 సినిమా తర్వాత మళ్లి అడవి శేష్ రెమ్యునరేషన్ పై అనేక వార్తలు వస్తున్నాయి.ప్రస్తుతం ఒక్కో సినిమాకు ఏడూ నుంచి పది కోట్ల రూపాయల వరకు పుచ్చుకుంటున్న శేష్ నిర్మాతల డిమాండ్ పెరుగుతున్న కొద్దీ అతడి డిమాండ్ కూడా పెరుగుతుంది.
అందుకే అతడి రెమ్యునరేషన్ ప్రస్తుతం చుక్కల్లో ఉందని అంత అనుకుంటున్నారు.ఇక అడవి శేష్ ఎంత డిమాండ్ చేసిన కూడా ఇవ్వడానికి చాల మంది నిర్మాతలు లైన్ లో ఉన్నారట.ఇక ఇప్పటి వరకు థ్రిల్లర్ జోనర్ లో మాత్రమే సినిమాలు తీస్తునం అడవి శేష్ జోనర్ మార్చితే చూడాలని ఒక వర్గం ప్రేక్షకులు కోరుకుంటున్నారు.థ్రిల్లర్స్ కేవలం A సెంటర్స్ లో మాత్రమే బాగా కనెక్ట్ అవుతాయి.
మరి B సెంటర్స్ లో ప్రేక్షకులు అడవి శేష్ కి కనెక్ట్ అవ్వాలంటే అడవి శేష్ జోనర్ మార్చక తప్పదు.