సాధారణంగానే వినాయకచవితి అంటే సృజనాత్మకత బయటకు వస్తుంది.గతంలో ఎన్నడూ ఎవరు చేయనటువంటి వినాయకున్ని వారు తయారు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు.
ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా అలాంటి వినాయకులు చాలా అరుదుగా కనిపించారు కానీ గత సంవత్సరం అయితే వివిధ రూపాల్లో వినాయకుడు అందరిని అలరించాడు.
ఇక ఇప్పుడు కూడా కొందరు ఇంట్లోనే వినాయకుడుని అందంగా చూడముచ్చటగా చేసి సోషల్ మీడియాలో కొందరు షేర్ చేశారు.
అందులో ఒక వీడియో అందరిని ఆకట్టుకుంటుంది.చూడగానే వావ్ అనిపిస్తుంది.
అది ఏంటి అంటే యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్‌లో ఓ వ్యక్తి తనకు ఎంతో ఇష్టమైన తాబేలును పెంచుకుంటున్నాడు.
ఆ వ్యక్తి ఈ వినాయక చవితిని కొత్తగా సరికొత్తగా చెయ్యాలి అనుకున్నాడు.
ఇంకేముంది.తాబేలుపైనే వినాయకుడిని ప్రతిష్టించాడు.
తాబేలుపై వినాయకుడిని ఎంతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించాడు.దీంతో ఆ తాబేలు ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ ముద్దుముద్దుగా ఉంది.
విషయం తెలుసుకున్న స్థానికులు ఆ తాబేలును చూడటానికి ఎంతో ఆసక్తిని కనబరిచారు.అది కాస్తా సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో వీడియో వైరల్ గా మారింది.
మరి మీరు ఓసారి వీడియో చూసేయండి.నిజంగానే ఆ తాబేలుపై వినాయకుడు ఎంతో అందంగా కనిపించాడు.