మాజీ మిస్ యూనివర్స్ ఊర్వశి రౌతేలా బాలీవుడ్ బ్యూటీ అయినప్పటికీ ఈమె అన్ని భాషల వారికీ సుపరిచితమే.మరీ ముఖ్యంగా సోషల్ మీడియాను ఫాలో అయ్యే వారికీ ఈమె బాగానే తెలుస్తుంది.
ఎందుకంటే ఇటీవలే కాలంలో ఈమె ఒక వివాదంతో బాగా ఫేమస్ అయ్యింది.ఇదిలా ఉండగా ఈమె టాలీవుడ్ లోని ఎంట్రీ ఇవ్వబోతుంది.
స్పెషల్ సాంగ్ తో మెగాస్టార్ సినిమా ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది.మెగాస్టార్ చిరంజీవి ప్రెజెంట్ వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉంది.ఈ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ను దింపారు.
చిరంజీవి, మాస్ రాజా రవితేజ కాంబోలో రాబోతున్న ఈ సాంగ్ లో ఈమె స్టెప్పులు వేస్తుంది.ఇక మెగాస్టార్ ఇచ్చిన అవకాశాన్ని అందుకున్న ఊర్వశి మరో రెండు సినిమాలలో కూడా స్పెషల్ సాంగ్స్ చేయబోతుంది అని టాక్ వస్తుంది.
ఇప్పటికే రామ్, బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమాలో ఈమె ఒక సాంగ్ చేస్తుంది అని రూమర్స్ వచ్చాయి.

ఇక ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానితో కూడా ఈ అమ్మడు స్టెప్పులు వేయబోతుంది అనే టాక్ వస్తుంది.నాని ప్రెజెంట్ చేస్తున్న సినిమా దసరా.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
అయితే ఈ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ఉందట.మరి ఆ సాంగ్ కోసం ఈ అమ్మడిని సంప్రదించారని.
నానితో ఈమె స్టెప్పులు వేయబోతుంది అని అంటున్నారు.నాని-ఊర్వశి కాంబోలో ఐటెం సాంగ్ అంటే ఆయన ఫ్యాన్స్ కూడా ఈగర్ గా వైట్ చేస్తున్నారు.
చూడాలి ఈ వార్తలో ఎంత నిజం ఉందో.







