ప్రముఖ నటుడు, సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ కన్నుమూసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన అంత్యక్రియలు ఎల్లుండి నిర్వహించనున్నారు.
రేపు అష్టమి కావడంతో ఎల్లుండి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు.మరికాసేపట్లో కృష్ణ పార్థివ దేహాన్ని నానక్ రామ్ గూడలోని నివాసానికి తరలించనున్నారు.
అనంతరం అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని గచ్చిబౌలికి తరలించే అవకాశం ఉంది.
కార్డియాక్ అరెస్ట్ కావడంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆదివారం రాత్రి 2 గంటల సమయంలో ఆస్పత్రికి తరలించారు.
ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్సను అందిస్తున్న ఆయన వైద్యానికి ఆయన శరీరం సహకరించలేదని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.బ్రెయిన్ డ్యామేజీ కారణంగా మల్టిపుల్ ఆర్గాన్స్ దెబ్బతిన్నట్లు డాక్టర్లు గుర్తించారు.
ఇంటర్నేషనల్ స్థాయి వైద్యం అందించినా ఫలితం కనిపించలేదు.ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం 4.09 గంటల సమయంలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.







