గుజరాత్ లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే ఢిల్లీ, పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్.
గుజరాత్ లోనూ సత్తా చాటాలని భావిస్తోంది.ఈ నేపథ్యంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాలు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
అహ్మదాబాద్ లోని హిమ్మత్ నగర్ లో రెండు రోజులపాటు కేజ్రీవాల్, సిసోడియాలు పర్యటించనున్నారు.రేపు భావ్ నగర్ లో బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.రెండు రోజుల పర్యటనకు వెళ్తున్నట్లు కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.విద్య, వైద్యానికి సంబంధించి గుజరాత్ ప్రజలకు గ్యారెంటీ ఇస్తామని తెలిపారు.
గుజరాత్ లో ఆప్ అధికారంలోకి వస్తే ఢిల్లీలో మాదిరిగానే మంచి స్కూళ్లు, ఆస్పత్రులు, మొహల్లా క్లినిక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు.ఈ పర్యటనలో భాగంగా యువతతో సమావేశం అవుతామని పేర్కొన్నారు.
మరోవైపు మనీశ్ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు.ఢిల్లీ ఎక్సైజ్ టెండర్లకి సంబంధించి అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలతో … ఆయనకు సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో సోదాలను నిర్వహించిన సంగతి తెలిసిందే.







