ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా గురించి అందరికీ తెలిసిందే.మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ గా ఉన్న ఆయన.
సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆయన యాక్టివ్ గా ఉంటారు.సేవా కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉండే ఆయన.ఆపదలో ఉన్నవారికి తనవంతు సహాయం చేస్తూ ఉంటారు.సోషల్ మీడియాలో తన దఈష్టికి వచ్చిన వారికి సహాయం చేస్తూ ఉంటారు.
సోషల్ మీడియాలో కనిపించే అనేక ఆసక్తికర వీడియోలను పంచుకుంటూ ఉంటూ ఉంటారు.అలాగే టాలెంట్ ఉన్న వ్యక్తుల వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు.
తాజాగా ట్విట్టర్ లో ఓ యువకుడు ఆనంద్ మహీంద్రాకు ఆసక్తికర ట్వీట్ చేశాడు.తనకు జాబ్ ఇప్పించాలని కోరాడు.
దీనిపై వెంటనే స్పందించిన ఆనంద్ మహీంద్రా.వెంటనే అతడిని కాంటాక్ట్ అవ్వాలని తన సిబ్బందికి సూచించారు.
ఆ యువకుడు పాత సామాగ్రిని ఉపయోగించి తయారు చేసిన ఓ ఎలక్ట్రిక్ జిప్ వీడియోను ఆనంద్ మహీంద్రాకు షేర్ చేశాడు.

ఈ వీడియో షేర్ చేసిన పది నిమిషాలకే ా యువకుడి ట్వీట్ పై ఆనంద్ మహీంద్రా స్పందించాడు.తమిళనాడుకు చెందిన గౌతమ్ అనే యువకుడు పాత సామాగ్రిని ఉపయోగించి ఎలక్ట్రిక్ కారు తయారుచేయగా.కారుకు ఉన్న ముందు, వెనుక చక్రాలను విడివిడిగా నియంత్రించవచ్చని ఆ వీడియోలో వివరించాడు.
ఈ వీడియో ఆనంద్ మహీంద్రాకు బాగా నచ్చింది.అతని టాలెంట్ కు ఫిదా అయ్యారు.
ఎలక్ట్రిక్ వాహనదాల రంగంలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని ఈ యువకుడి నైపుణ్యం చూస్తే తనకు అనిపిస్తుందని ఆనంద్ మహీంద్రా పేర్కొన్నారు.అతనిని సంప్రదించి జాబ్ లోకి తీసుకోవాలని తన సిబ్బందికి సూచించారు.
వాహనాలు, టెక్నాలజీపై ప్రజలకు ఉన్న మక్కువ చూస్తుంటే భారత్ ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో అగ్రగామిగా సాధిస్తుందని తెలిపారు.







