మాస్ రాజా రవితేజ స్పీడ్ ను మిగతా హీరోలు అందుకోవడం చాలా కష్టం.ఎందుకంటే రవితేజ ఏడాది నాలుగు సినిమాలు చేస్తూ జెట్ స్పీడ్ గా దూసుకు వెళ్తాడు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన క్రాక్ సినిమాతో ఈ ఏడాది మాస్ మహారాజ రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.చాలా రోజుల తర్వాత హిట్ అందుకోవడంతో రవితేజ ఫుల్ జోష్ తో సినిమాలు చేస్తున్నాడు.
ఇక అయితే తాజాగా రవితేజ ఒక సినిమా నుండి తప్పించుకున్నాడని అతడి లక్ బాగుందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.ఈ న్యూస్ ఎందుకు బయటికి వచ్చిందంటే.
ఈ మధ్యనే రాజ్ తరుణ్ నటించిన ‘అనుభవించు రాజా’ సినిమా బాక్సాఫీస్ బరిలో నిలిచి ప్లాప్ అయ్యింది.ఈ సినిమాకు శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహించారు.
అయితే ఈ సినిమా డైరెక్టర్ ఈ కథతో ముందుగా రవితేజ దగ్గరకు వెళ్ళాడట.కానీ రవితేజ ఈ సినిమాకు ఓకే చెప్పక పోవడంతో ఇక ఆయన రాజ్ తరుణ్ ను ఒప్పించి ఆయనతో సినిమా చేసాడట.
అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 26న ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించలేక చతికల పడిపోయింది.దీంతో ఈ సినిమా ప్లాప్ నుండి రవితేజ తప్పించు కున్నాడని ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ‘ఖిలాడీ’ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ముగించేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది.ఇక ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో మరోక సినిమా చేయబోతున్నాడు.శరత్ మండవ దర్శకత్వంలో ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను చేస్తున్నాడు.స్వామిరారా ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాను ప్రకటించాడు.అన్ని సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేస్తున్నాడు.