కృష్ణా జిల్లాలోని గన్నవరం ఎయిర్ పోర్టులో మూడు విమానాలు అత్యవసర ల్యాండింగ్ అయ్యాయి.శంషాబాద్ ఎయిర్ పోర్టులో పొగమంచు కారణంగా వాతావరణ అనుకూలించకపోవడంతో గన్నవరం విమానాశ్రయంలో మూడు ఇండిగో విమానాలను అత్యవసర ల్యాండింగ్ చేశారు.
ఛండీగఢ్ – హైదరాబాద్, గోవా – హైదరాబాద్ మరియు తిరువనంతపుర నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన విమానాలను గన్నవరంలో ల్యాండింగ్ చేశారు. ఒక్కో విమానంలో దాదాపు 150 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని తెలుస్తోంది.అత్యవసర ల్యాండింగ్ నేపథ్యంలో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు.అయితే వీరిలో చాలా మంది ప్రయాణికులు హైదరాబాద్ కు రావాల్సి ఉన్న నేపథ్యంలో వేచి చూస్తున్నారు.