మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి అండతో అల్లు అర్జున్ తర్వాత అల్లు అరవింద్ వారసుడుగా అల్లు శిరీష్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.అయితే నటుడుగా ఏ విషయంలో కూడా పూర్తి స్థాయిలో మార్కులు సొంతం చేసుకోలేకపోయిన అల్లు శిరీష్ ఏదో మోస్తారు సినిమాలతో నెట్టుకొని వస్తున్నాడు.
చివరిగా శ్రీరస్తు శుభమస్తు సినిమాతో హిట్ కొట్టిన శిరీష్ తరువాత అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చే సినిమా చేయలేదు.అయితే దర్శకులు కొత్త కథలతో తన దగ్గరకి రాకపోవడంతో తానే ఇతర భాషలలో హిట్ అయిన సినిమాలని వెతుక్కొని తన మార్కెట్ కి సరిపోయే విధంగా సిద్ధం చేసుకొని ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు.
ఇప్పుడు మరోసారి అలా తమిళంలో సూపర్ హిట్ అయిన ఓ చిన్న సినిమాని తెలుగులో రీమేక్ చేయడానికి అల్లు శిరీష్ సిద్ధం అయ్యాడు.ఇక ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ వర్క్ కూడా ఇప్పటికే మొదలెట్టినట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకి రాకేశ్ శశి దర్శకత్వం వహించనున్నారు.ఇప్పటికే మెగా కాంపౌండ్ లో మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ తో విజేత అనే సినిమాని రాకేశ్ శశి దర్శకత్వం వహించారు.
ఇప్పుడు మెగా కాంపౌండ్ లో మరో చిన్న హీరో అల్లు శిరీష్ తో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.