ఎల్లలు దాటి, అమెరికాలో ఉంటూ అక్కడ హిందూ దేవాలయాలకి పూజలు చేస్తూ భారతీయ సంస్కృతిని సాంప్రదాయాలని గౌరవిస్తూ భారతీయతని చాటి చెప్తున్న అమెరికాలో నివాసం ఉంటున్న ఎన్నారై అర్చకులకి తిరుమల తిరుపతి దేవస్థానం ఆయా రంగంలో మరింత శిక్షణ ఇచ్చేందుకు సిద్దమవుతోంది.అమెరికాలోని
శ్రీవేంకటేశ్వర ఆలయాల్లోని పూజారులకు వర్క్ షాప్ ఆన్ ఆగమిక్ స్టాండర్డ్స్ ఎట్ ఎస్వీ టెంపుల్స్ ఇన్ యూఎస్‌ఏ పేరిట శిక్షణ ఇవ్వనుంది.
ఈ శిక్షణ కార్యక్రమాలని పిట్స్‌బర్గ్‌లో ఆలయంలో ఈ నెల 29, 30 న ఈ శిక్షణ శిబిరం నిర్వహించనున్నారు.అక్కడి హిందూ దేవాలయాల్లో ఆగమశాస్త్ర ప్రమాణాలు పాటించేలా ప్రధాన పూజారులు, ఆలయ నిర్వాహకులతో టీటీడీ ఆగమ పండితుల బృందం సమావేశమై సూచనలు చేయనుంది…2010లో టీటీడీ మొట్టమొదటిసారిగా శ్రీనివాస కల్యాణాలను అమెరికాలో నిర్వహించింది.ఈ కార్యక్రమానికి ఎన్‌ఆర్‌ఐల నుంచి విశేష స్పందన లభించింది.
అయితే ఆ తర్వాత 2015లో నాలుగు ప్రధాన పట్టణాల్లో శ్రీనివాస కల్యాణాలు వైభవోపేతంగా జరిపించారు.
ఈ నేపథ్యంలో తిరుమల తరహాలోనే అమెరికాలోని ఆలయాల్లోనూ ఆగమశాస్త్రం ప్రకారం పూజలు నిర్వహించేలా సూచనలు, సలహాలు ఇవ్వాలని అక్కడి అర్చకులు కోరారు…దాంతో ముఖ్యమంత్రి సూచన మేరకు టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం కూడా లభించడంతో ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.