యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయి స్టార్ అయిపోయిన విషయం తెల్సిందే.బాహుబలి చిత్రం ఏ రేంజ్‌లో విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఆ చిత్రం తర్వాత బాలీవుడ్ నుండి సైతం ప్రభాస్‌కు ఆఫర్లు వస్తున్నాయి.అయితే ప్రభాస్ మాత్రం టాలీవుడ్‌లోనే సినిమాలు చేయాలని భావిస్తున్నాడు.
ప్రస్తుతం ‘సాహో’ చిత్రంను సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్నాడు.ఆ చిత్రం దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ నిర్మాతలు నిర్మిస్తున్నారు.
తాజాగా ప్రభాస్ కొత్త సినిమా ప్రారంభం అయ్యింది.
గోపీచంద్‌తో ‘జిల్’ వంటి భిన్నమైన స్టైలిష్ మూవీని తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ తదుపరి చిత్రం చేయబోతున్నాడు.జిల్ చిత్రంను పది కోట్ల లోపు బడ్జెట్‌తో తెరకెక్కించిన రాధాకృష్ణ తన తదుపరి చిత్రాన్ని ఏకంగా 150 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబోతున్నాడు.తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో ఒకేసారి రూపొందబోతున్న ఈ చిత్రంకు నిర్మాతలు భారీ మొత్తంలో ఖర్చు చేయబోతున్నారు.
ప్రభాస్‌కు ఉన్న మార్కెట్‌ను చూస్తే ఈ 150 కోట్లు పెద్ద లెక్క కాదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సౌత్‌లో ముఖ్యంగా తెలుగులో ఇప్పటి వరకు 100 కోట్లకు పైగా పెట్టుబడితో వచ్చిన సినిమాలను వేళ్లమీద లెక్కించవచ్చు.
వంద కోట్ల బడ్జెట్‌ను రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదు.సినిమా సూపర్ డూపర్ హిట్ అయితే తప్ప వంద కోట్లు సాధ్యం కాదనే విషయం అందరికి తెల్సిందే.
అయినా కూడా ప్రభాస్ 150 కోట్లతో మరోసారి ప్రయోగం చేస్తున్న కారణంగా అంతా కూడా సినిమాపై అంచనాలు పెంచుకుంటున్నారు.
‘బాహుబలి’ సినిమాకు ముందు ప్రభాస్ సినిమా బడ్జెట్ 25 కోట్ల లోపే ఉండేది.కాని బాహుబలి తర్వాత వరుసగా వంద కోట్ల బడ్జెట్‌లతో సినిమాలను ప్రభాస్ చేస్తున్నాడు.భవిష్యత్తులో కూడా ప్రభాస్ 100 కోట్ల బడ్జెట్‌తోనే సినిమా చేస్తాడేమో చూడాలి.