ప్రస్తుతం రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్.ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.అయితే మరొక నాలుగు రోజుల్లో ఎన్టీఆర్ పుట్టిన రోజు రాబోతుంది.
మే 20 న ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ఏం సర్ప్రైజ్ ఇస్తుందో అని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రాజమౌళి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీంతో పాటు ఆర్ ఆర్ ఆర్ కొత్త రిలీజ్ డేట్ కూడా ప్రకటించ బోతున్నారని సమాచారం.ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో షూటింగ్స్ అన్ని నిలిచి పోయాయి.అందువల్ల ఆర్ ఆర్ ఆర్ సినిమా కూడా షూటింగ్ వాయిదా వేసుకున్నారు.

ఇప్పట్లో షూటింగ్స్ ప్రారంభం అయ్యేలా కనిపించడం లేదు.అందుకే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా మారబోతుందని సమాచారం.అందుకే ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తుంది.
దీంతో పాటు ఎన్టీఆర్ పాత్రకు సంభందించిన పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నారని టాక్.ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.
ఈ సినిమాను డివివి దానయ్య 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్ నటిస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాపై ఇప్పటికే చాలా అంచనాలు ఉన్నాయి.
ఇక సినిమాలో ఈ స్టార్ హీరోలను రాజమౌళి ఎలా ప్రెసెంట్ చేస్తారో అని అభిమానులు ఆతృతగా ఎదురు చుస్తునారు.