ప్రకాశవంతమైన ముఖానికి హోంమేడ్ హెర్బల్ ప్యాక్స్

సాధారణంగా చాలా మంది ముఖం ప్రకాశ వంతంగా ఉండటానికి కాస్మొటిక్స్ మీద ఆధార పడుతూ ఉంటారు.అయితే వాటి కారణంగా ముఖం మీద ఎలర్జీలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

 Miracle Herbal Face Packs For Glowing Skin Details, Herbal Face Packs, Glowing S-TeluguStop.com

ఎందుకంటే వాటిలో వాడే కొన్ని కెమికల్స్ కారణంగా ఎలర్జీలు వస్తాయి.అందువల్ల ఎటువంటి ఎలర్జీలు, సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండాలంటే హెర్బల్ పాక్స్ ఉపయోగించాలి.

హెర్బల్ పాక్స్ ని ఇంటిలోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

తేనె: 

తేనెలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన చర్మ సమస్యలను తగ్గించటంలో సహాయ పడుతుంది.ప్రతి రోజు ముఖానికి తేనె  రాసుకొని పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Telugu Curd, Skin, Herbal Face, Honey, Natural Face, Papaya, Skin Care Tips-Telu

కలబంద:

కలబంద దాదాపుగా అన్ని రకాల చర్మ సమస్యలకు పరిష్కరాన్ని చూపుతుంది.ముఖ్యంగా డార్క్ స్పాట్స్, హైపర్ పిగ్మెంటేషన్ తగ్గించటంలో చాలా సమర్ధ వంతంగా పనిచేస్తుంది.కలబంద జెల్ ని ముఖానికి రాసి 5 నిముషాలు మసాజ్ చేసి పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా ఒక నెల పాటు క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.

బొప్పాయి:

ఇది చర్మం మీద మ్యాజిక్ వలె పనిచేస్తుంది.బొప్పాయిలో ఉండే పోషకాలు నల్లటి వలయాలను తగ్గించటంలో సహాయ పడుతుంది.

బొప్పాయి గుజ్జును ముఖానికి రాసి పావుగంట తర్వాత చాలాల్ని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Telugu Curd, Skin, Herbal Face, Honey, Natural Face, Papaya, Skin Care Tips-Telu

పెరుగు:

పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ ముఖం మీద బ్లీచింగ్ వలె పనిచేసి కాంతి వంతంగా పనిచేస్తుంది.పెరుగుని తీసుకుని చర్మంపై అప్లై చేసి ఆ తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్ర పరచుకోవాలి.పెరుగు చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి చర్మాన్ని మరింత కాంతి వంతంగా మార్చుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube