అమెరికా(America) అంటే అందరికీ క్రేజే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.డాలర్ల (Dollars)కలను నిజం చేసుకోవాలని ఎంతోమంది అక్కడికి వెళ్తుంటారు.
జాబ్స్, కెరీర్, లైఫ్ సెటిల్మెంట్(Jobs, Career, Life Settlement) ఇలా చాలా ఆశలు ఉంటాయి.కానీ అన్నీ అనుకున్నంత ఈజీగా ఉండవు కదా.కొంతమందికి కల్చర్ షాక్, ఇంకొందరికి ఫ్యామిలీని వదిలి ఉండలేకపోవడం, మరికొందరికి హోమ్ సిక్ ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి.
ఇలాంటి సమయంలో అనిరుద్ధ అంజన అనే ఒక ఇండియన్ ఎంటర్‌ప్రెన్యూయర్ (Indian Entrepreneur)చేసిన పని మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది.
అతను ఆర్క్‌అలైన్డ్(ArcAligned) అనే కంపెనీకి సీఈఓ(CEO).పదేళ్లు అమెరికాలో ఉన్నాడు.లైఫ్ సూపర్ సెట్ అనుకున్నారంతా.కానీ ఉన్నట్టుండి ఇండియాకి వచ్చేశాడు.ఇంతకీ ఎందుకు వచ్చాడో తెలుసా? జాబ్ పోయిందా? వీసా సమస్యలా? చాలామంది ఇదే అనుకున్నారు.కానీ అసలు కారణం వేరు.అనిరుద్ధ స్వయంగా చెప్పాడు అసలు విషయం.“నేను ఇండియాకి వచ్చేస్తున్నానని పోస్ట్ చేసినప్పుడు చాలామంది జాబ్ పోయిందని లేదా వీసా సమస్యల వల్లే అనుకున్నారు.కానీ నిజం అది కాదు.మా అమ్మానాన్న గురించే నేను ఇండియాకి వచ్చాను,” అని ఇన్‌స్టా పోస్ట్‌లో క్లారిటీ ఇచ్చాడు అనిరుద్ధ.

“మా అమ్మానాన్న నన్ను రమ్మని ఎప్పుడూ అడగలేదు.కానీ వాళ్లకి నా అవసరం ఉందని నాకు తెలుసు,” అని ఎమోషనల్‌గా చెప్పాడు.ఇండియాకి తిరిగి వచ్చి ఏడాది అయ్యాక అనిరుద్ధ ఏమంటున్నాడో తెలుసా? “ఇది నా జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్.వాళ్ల జీవితాల్లో కాదు, నా జీవితంలో కూడా సంతోషం నింపింది,” అని హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు.
అంతేకాదు, ఇంతకుముందు ఒకసారి అనిరుద్ధ అమెరికాలోని కార్పొరేట్ లైఫ్‌లో రోబోలాగా మారిపోతున్నానని, తన ఐడెంటిటీని కోల్పోతున్నానని కూడా చెప్పాడు.అందుకే మరింత మీనింగ్‌ఫుల్ లైఫ్ కోసం వెతుకులాట మొదలుపెట్టాడు.
ఇప్పుడు పేరెంట్స్‌తో ఉండటం వల్ల ఆ మీనింగ్ దొరికినట్టే కదా.

అనిరుద్ధ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.చాలామంది “అవును నిజమే, ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండటమే ముఖ్యం” అని కామెంట్ చేశారు.“మీరు తీసుకున్నది కరెక్ట్ డెసిషన్, నేను కూడా రిలేట్ చేసుకోగలను” అని ఇంకొందరు మెసేజ్ పెట్టారు.కుటుంబానికి ఇచ్చిన విలువలకి చాలామంది ఫిదా అయిపోయారు.డబ్బు, హోదా కాదు, కుటుంబం, ఆనందమే ముఖ్యం అని నిరూపించాడు అనిరుద్ధ.







