భారతీయులకు క్రికెట్ Cricket for Indians)అంటే కేవలం ఆట కాదు, అది ఒక ఎమోషన్, ఒక పండగ.గుజరాత్‌లో జరిగిన ఒక పెళ్లిలో ఇది నిజంగానే రుజువైంది.
పెళ్లి మండపంలో పెళ్లి తంతు జరుగుతుండగా, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.పెళ్లి పీటలపై కూర్చున్న పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు (bride ,groom)ఒక్కసారిగా టీవీ స్క్రీన్ వైపు చూస్తూ ఆగిపోయారు.
కారణం ఏంటంటే, అప్పుడే విరాట్ కోహ్లీ ( Virat Kohli)పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో సెంచరీ కొడుతున్నాడు మరి.

పెళ్లి జరుగుతుండగానే అందరూ టీవీలకు అతుక్కుపోయారు.పెళ్లి మండపంలోనే పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసి మరీ మ్యాచ్ చూశారు.పెళ్లికి వచ్చిన బంధువులు, స్నేహితులు అందరూ కోహ్లీ బ్యాటింగ్ చూస్తూ టెన్షన్ పడ్డారు.
చివరికి కోహ్లీ(Kohli) ఫోర్ కొట్టి సెంచరీ పూర్తి చేయగానే పెళ్లింట ఒక్కసారిగా కేరింతలు, చప్పట్లు హోరెత్తాయి.పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు అయితే తమ ఆనందాన్ని ఆపుకోలేకపోయారు.
ఒకరి చేతులు ఒకరు పట్టుకుని గట్టిగా నిలబడి చప్పట్లు కొడుతూ అరిచారు.పెళ్లికి వచ్చిన వాళ్లంతా వాళ్లతో గొంతులు కలిపారు.
కోహ్లీ సెంచరీకి, ఇండియా గెలుపుకి ఒకేసారి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.

“పెళ్లి ఆగింది కానీ, కోహ్లీ సెంచరీ ఆగలేదు” అంటూ వీడియోకి క్యాప్షన్ పెట్టారు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు.“ఇండియాలో క్రికెట్ ఒక ఆట కాదు.అది దేశభక్తిని చాటే ఎమోషన్” అని ఒకరు కామెంట్ చేస్తే, “పెళ్లిళ్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు కానీ ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ మాత్రం మిస్ అవ్వకూడదు” అని మరొకరు ఫన్నీగా కామెంట్ చేశారు.మొత్తానికి ఈ వీడియోతో మరోసారి ప్రూవ్ అయింది.
ఇండియాలో క్రికెట్ ముందు ఏదీ నిలబడలేవు, పెళ్లిళ్లు కూడా అంతే మరి.ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.







