బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) నటించిన జవాన్ సినిమా( Jawaan movie ) ట్రైలర్ విడుదల అయ్యి చాలా రోజులు అయింది అన్న విషయం మనం అందరికి తెలిసిందే.ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ఈ ట్రైలర్ ను విడుదల చేసిన 24 గంటల లోపు వచ్చిన వ్యూస్ గురించి తాజాగా నిర్మాతలు ఒక పోస్ట్ పెట్టారు.అన్నిచోట్ల కలిపి ఏకంగా 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని పోస్టర్ రిలీజ్ చేశారు.
దాంతో అసలు గొడవ మొదలైంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రస్తుతం ప్రభాస్ ఫ్యాన్స్ vs షారుక్ ఫ్యాన్స్ అనే పరిస్థితి కనిపిస్తుంది.
జూలై 6న ప్రభాస్ సలార్ టీజర్( Salar Teaser ) విడుదలైన విషయం తెలిసిందే.
ఈ వీడియోలో ప్రభాస్( Prabhas ), 10 సెకన్లకు మించి కనిపించలేదు.అయినా కూడా 24 గంటల్లో 83 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.ఆ నంబర్స్ యూట్యూబ్‌లో కనిపించాయి.
కానీ జవాన్ ట్రైలర్‌కి 112 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయని చెప్పారు కానీ ఆ నంబర్ ఎక్కడ కనిపించలేదు.జవాన్ సినిమా నిర్మాతలు వచ్చి రాని వ్యూస్ ని అబద్ధాలు చెప్పి గ్రాండ్ గా ప్రకటించుకోవడం వరకు బాగానే ఉంది.
కానీ యూట్యూబ్ వ్యూస్‌లో చాలా డిఫరెన్స్ కనిపించింది.అన్ని భాషలు కలిపి కేవలం 55 మిలియన్ల వ్యూస్ మాత్రమే వచ్చాయి.
దీంతో ప్రభాస్ ఫ్యాన్స్, షారుక్ ఫ్యాన్స్ మా హీరో గొప‍్ప అంటే మా హీరో గొప్ప అంటూ వరుస ట్వీట్ లు చేస్తున్నారు.
ఇక ఇద్దరి హీరోల అభిమానుల గొడవ చూసినా నెటిజెన్స్ ఇదెక్కడి గోల రా బాబు అని అనుకుంటున్నారు.కేవలం వ్యూస్ విషయంలో ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య సోషల్ మీడియాలో ఒక చిన్నపాటి యుద్ధం జరుగుతోందని చెప్పవచ్చు.కాగా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా సెప్టెంబర్ 7న గ్రాండ్ గా విడుదల కానుంది.
ఇక ప్రభాస్ నటించిన సలార్ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.ఈ రెండు సినిమాలపై కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.ఈ ముఖ్యంగా సలార్ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయని చెప్పవచ్చు.