వేగంగా వెయిట్ లాస్ అవ్వాలనే కోరిక అధిక బరువుతో బాధ పడుతున్న వారిందరికీ ఉంటుంది.మరి ఏం చేస్తే ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు? కేవలం డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్‌గా కసరత్తులు చేస్తే సరిపోతుందా లేక ఇంకేమైనా చేయాలా.? ఇలా ఎన్నో ప్రశ్నలు మదిలో మెదులుతూ ఉంటాయి.అయితే బరువు తగ్గడానికి వర్కౌట్లు, డైటింగ్‌లు చేస్తే సరిపోదు.
మరిన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.ముఖ్యంగా కొన్ని కొన్ని జ్యూసులను డైట్‌లో చేర్చుకుంటే.
తొందరగా శరీర బరువును అదుపులోకి తెచ్చుకోవచ్చు.మరి ఆ జ్యూసులు ఏంటో చూసేయండి.
టమాటో జ్యూస్‌వెయిట్ లాస్ కు ఉపయోగపడే బెస్ట్ జ్యూస్‌గా చెప్పుకోవచ్చు.వారంలో మూడు, నాలుగు సార్లు టమాటో జ్యూస్ తీసుకుంటే.ఖచ్చితంగా బరువు తగ్గుతారు.అలాగే టమాటాలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల రోగ నిరోధక వ్యవస్థ కూడా బలపడుతుంది.

గ్రేప్ జ్యూస్.అధిక బరువును తగ్గించడంలో ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.ప్రతి రోజు ఒక గ్లాస్ గ్రేప్స్ నుంచి తయారు చేసుకున్న జ్యూస్‌ను తీసుకుంటే.శరీరంలో పేరుకుపోయిన కొవ్వు అంతా కరిగిపోతుంది.మరియు గ్రేప్ జ్యూస్ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా మారుతుంది.

క్యారెట్ జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.కంటి చూపును పెంచడంలోనూ, చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలోనూ, రక్త హీనతను తగ్గించడంలోనూ ఇలా ఎన్నో విధాలుగా క్యారెట్ జ్యూస్ ఉపయోగపడుతుంది.అలాగే రెగ్యులర్‌గా ఈ జ్యూస్ తీసుకుంటే బరువు కూడా తగ్గుతారు.
ఆకుకూరలతో తయారు చేసిన జ్యూస్ తీసుకోవడం ద్వారా వేగంగా బరువు తగ్గుచ్చు.ముఖ్యంగా బచ్చలికూర, క్యాబేజ్, పాల కూర, పుదీనా వంటి ఆకుకూరలతో జ్యూస్ తయారు చేసుకుని తీసుకుంటే మంచిది.