బెల్లంకొండ శ్రీనివాస్. తన తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ బ్యాగ్రౌండ్ తో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన నటుడు.
అల్లుడు శ్రీను సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు.తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు.
ఆ తర్వాత పలు సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాడు.ఆయన నటించిన పలు సినిమాలు డబ్బై పలు భాషల్లో విడుదల అయ్యాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో బెల్లంకొండకు అభిమానులున్నారు.అయితే సినిమాల ద్వారా శ్రీనివాస్ ఇప్పటి వరకు ఎంత సంపాదించాడు? అనే ప్రశ్న అందరికీ కలుగుతుంది.ఇంతకీ తన ఆస్తులెన్నో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటి వరకు 10కి పైగా సినిమాల్లో నటించాడు.
అయితే ఈయన సినిమాల్లో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలేవీ లేవని చెప్పుకోవచ్చు.ప్రస్తుతం కూడా ఆయన కెరీర్ మరీ అంత జోష్ ఫుల్ గా ఏమీ లేదు.
పది సినిమాల్లో రెండు, మూడు సినిమాలు మినహా మిగతావి పెద్దగా ఆడలేదు.వరుసగా రెండు సినిమాలు ఫట్ అయితే చాలా మంది హీరోలు తెరమరుగైన విషయం తెలిసిందే.
కానీ శ్రీనివాస్ ఇంకా కొనసాగుతున్నాడు.ఎందుకంటే కొడుకు కెరీర్ విషయంలో తన తండ్రి సురేష్ కొత్త పంథా అనుసరించాడు.
ఆయన యాక్ట్ చేసిన అన్ని సినిమాలను పలు భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశాడు.అక్కడ మంచి జనాదరణ దొరికింది.
శాటిలైట్ రైట్స ద్వారా కూడా బాగానే డబ్బులు పోగేశాడు.అందుకే శ్రీనివాస్ ను ఇంకా హీరోగా కొనసాగుతున్నాడు.ఆయన నటించిన పలు సినిమాల్లో టాప్ హీరోయిన్లుగా నటించారు.కారణం శ్రీనివాస్ ఫాదర్ పెద్ద నిర్మాత కావడమే అనే గుసగుసలూ వినిపిస్తున్నాయి
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ ఆస్తుల గురించి తెలుసుకుంటే.ఆయన ఒక్కో సినిమాకు రూ.5 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు.ఇప్పటి వరకు ఆయన నికర ఆస్తుల విలువ సుమారు 250 కోట్ల రూపాయలు ఉంటున్నట్లు తెలుస్తోంది.15 కోట్ల విలువ చేసే రెండు బంగళాలు ఉన్నాయి.ఈ రెండు ఇండ్లు కూడా ఆధునాతన సౌకర్యాలతో కూడి ఉన్నాయి.పలు సూపర్ లగ్జరీ కార్లు ఉన్నాయి.మూడు సూపర్ బైకులున్నాయి.