ఈ ఏడాది నవంబర్ లో యాంకర్ అరియానా పెళ్లి.. అబ్బాయి సిద్ధంగా ఉన్నాడంటూ?

బిగ్ బాస్ షో వల్ల బుల్లితెర యాంకర్ అరియానా కెరీర్ లో కీలక మలుపులు చోటు చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.బిగ్ బాస్ సీజన్4 కంటెస్టెంట్ అయిన అరియానా ఆ సీజన్ లో ఇతర కంటెస్టెంట్లకు గట్టి పోటీ ఇవ్వడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను మరింత పెంచుకున్నారు.

 Astrologer Shanti Shocking Comments About Ariyana Marriage Details Here, Ariyana Marriage, Astrologer, Bigboss House, Big Boss Ott, Bigboss-TeluguStop.com

కొన్ని విషయాలలో అరియానా గ్లోరీ బోల్డ్ గా ఉంటారనే విమర్శ ఉన్నా ఆమెను అభిమానించే అభిమానుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.

ప్రస్తుతం బిగ్ బాస్ ఓటీటీలోని కంటెస్టెంట్లలో అరియానా ఒకరిగా ఉన్నారు.

 Astrologer Shanti Shocking Comments About Ariyana Marriage Details Here, Ariyana Marriage, Astrologer, Bigboss House, Big Boss OTT, Bigboss-ఈ ఏడాది నవంబర్ లో యాంకర్ అరియానా పెళ్లి.. అబ్బాయి సిద్ధంగా ఉన్నాడంటూ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

టాప్ 7 కంటెస్టెంట్లలో ఒకరైన అరియానా బిగ్ బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ గా నిలవాలని ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.బిగ్ బాస్ షో నిర్వాహకులు ప్రతి సీజన్ లో ఆస్ట్రాలజర్ ను పంపి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సెలబ్రిటీల జాతకాల గురించి వెల్లడిస్తారనే సంగతి తెలిసిందే.

ఈ సీజన్ లో హౌస్ లోకి శాంతి అనే ఆస్ట్రాలజర్ ఎంట్రీ ఇచ్చి అరియానా జాతకం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అరియానా గ్లోరీ జాతకం అద్భుతంగా ఉందని ఫుల్ సెలబ్రేషన్స్ లో ఆమె లైఫ్ ఉండబోతుందని శాంతి కామెంట్లు చేశారు.

నవంబర్ లో అరియానా గ్లోరీ పెళ్లి జరిగే అవకాశం అయితే ఉందని శాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.అరియానాను పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి కూడా సిద్ధంగా ఉన్నాడని శాంతి అభిప్రాయం వ్యక్తం చేశారు.

కొత్త జీవితం, కొత్త ఇల్లు అరియానా కోసం ఉన్నాయని శాంతి తెలిపారు.

అయితే నెటిజన్లు మాత్రం శాంతి చెప్పిన జాతకంలో కొన్ని విషయాలు నిజమయ్యే అవకాశాలు అయితే లేవని చెబుతుండటం గమనార్హం.బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అరియానా కెరీర్ కు ప్రాధాన్యత ఇస్తారని ఆమె పెళ్లి చేసుకునే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అరియానా తన పెళ్లి గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube