సీఎం పవన్ వర్సెస్ సీఎం ఎన్టీఆర్.. ఏంటీ కొత్త నినాదాలు..?

టాలీవుడ్ హీరోల్లో పవన్ కళ్యాణ్‌‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు మాస్‌లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుంది.

 Cm Pawan Vs Cm Ntr What Are The New Slogans Details, Andhra Pradesh, Pawan Kaly-TeluguStop.com

వాళ్ల సినిమాలు విడుదలైన సమయంలో థియేటర్ల దగ్గర హడావిడి వాళ్ల ఫాలోయింగ్‌ను చాటి చెప్తుంది.అయితే కొన్ని ఫంక్షన్‌లలో అభిమానుల మధ్య పోటా పోటీ నెలకొంటుంది.

మా హీరో గొప్ప అంటే.కాదు మా హీరో గొప్ప అంటూ అభిమానులు రచ్చ రచ్చ చేస్తుంటారు.

అలాంటి సందర్భాల్లో అభిమానులను కంట్రోల్ చేయడం దాదాపుగా అసాధ్యం.

తాజాగా పశ్చిమగోదావరిలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది.

పాలమూరు మహంకాళి జాతరలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అభిమానులు ఒకరికొకరు తలపడ్డారు.ఈ జాతరలో కొందరు పవన్ కళ్యాణ్ అభిమానులు సీఎం పవన్ కళ్యాణ్ అంటూ నినాదాలు చేశారు.

ఈ నినాదాలను తట్టుకోలేని ఎన్టీఆర్ అభిమానులు సీఎం ఎన్టీఆర్ అంటూ పోటా పోటీగా నినాదాలు చేశారు.దీంతో వీళ్ల వ్యవహారం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఒక హీరో ఎమ్మెల్యే కూడా కాదు.మరొకరు అసలు రాజకీయాల్లో కూడా లేరు.అయినా వాళ్లు సీఎం అవ్వడం ఏంటూ అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

Telugu Andhra Pradesh, Janasena, Jrntr Fans, Ntr Cm, Pawan Kalyan, Pawan Kalyan

అసలు ఈ అభిమానులు దేని కోసం పోరాడుతున్నారంటూ నిలదీస్తున్నారు.పవిత్రమైన దేవుడి జాతరలో ఇలా వ్యక్తిగతంగా నినాదాలు చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకుంటాయని.

అప్పుడు సీఎం తమ నాయకుడే అని చాటిచెప్పాలని పవన్ అభిమానులు తాపత్రయపడుతున్నారు.

Telugu Andhra Pradesh, Janasena, Jrntr Fans, Ntr Cm, Pawan Kalyan, Pawan Kalyan

అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో లేకపోయినా టీడీపీకి భవిష్యత్ నాయకుడు తమ హీరోనే అంటూ ఎన్టీఆర్ అభిమానులు భావిస్తున్నారు.అందుకే పవన్ అభిమానులకు ధీటుగా ఎన్టీఆర్ అభిమానులు కూడా సీఎం అంటూ నినాదాలు చేసిన పరిస్థితి కనిపిస్తోంది.అయితే మహంకాళి జాతరలో ఇరువర్గాల అభిమానుల మధ్య వాతావరణం ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగి జోక్యం అభిమానులను చెదరగొట్టాల్సి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube