ఈ 'టాక్సీవాలా' స్పీడ్ ఎంత ..? కేసీఆర్ ని మించిపోతాడా ..?

తెలంగాణ సీఎం కేసీఆర్ కి ఇప్పుడు ఏ చింతా లేదు… హాయిగా రిలాక్స్ గా తాను అనుకున్న పనులన్నిటినీ చక్కబెట్టుకోవచ్చు… కారణం ఏంటి అంటే…? ప్రస్తుతానికి తెలంగాణాలో ఎన్నికలు దిగ్విజయంగా పూర్తి అవ్వడమే కాకుండా ముందు నుంచి అనుకున్నట్టుగానే … మళ్ళీ పార్టీ అధికారం లోకి వచ్చేసింది.ఇంకో ఐదు ఏళ్ళ వరకు ఎటువంటి ఢోకా లేదు.

 What About Trs Leader Kcr Speed In Telangana-TeluguStop.com

పార్టీ పగ్గాలు కూడా… తన తనయుడు కేటీఆర్ కి అప్పచెప్పేసాడు.ఇంకా కేసీఆర్ కి వచ్చిన టెన్షన్ ఏమీ లేదు.

ఎందుకంటే కేటీఆర్ సామర్ధ్యం ఏంటో ఇప్పటికే అందరికి అర్ధం అయిపొయింది.మళ్ళీ తనకు తాను నిరూపించుకోవాల్సిన అవసరమే లేదు.

తండ్రికి తగ్గ తనయుడిగా… కేటీఆర్ ఇంటా బయట అందరిచే ప్రశంసలు అందుకుంటున్నాడు.కేటీఆర్ కి పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పదవీ ఇవ్వడం ద్వారా… కేటీఆర్ పార్టీలో నెంబర్ 2 అనే సంకేతాలను కేసీఆర్ ఇచ్చేసాడు.

ప్రస్తుత ట్రెండింగ్ కి అనుగుణంగా… అందరితోనూ… కలుపుగోలుగా ఉండడం… సోషల్ మీడియా ద్వారా కూడా అందరికి సమాధానాలు ఇవ్వడం… అక్కడ కనిపించే సమస్యల మీద స్పందించడం ఇవన్నీ కేటీఆర్ లో కనిపిస్తున్న అదనపు క్వాలిఫికేషన్ లు.అంతే కాదు… కేసీఆర్ కుమారుడిగా కేటీఆర్ ను పార్టీలో అందరూ గౌరవిస్తారు.తండ్రికి తగ్గ తనయుడిగా అధినేత అప్పగించిన ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకుంటారు.ఆలస్యంగా పార్టీలోనికి వచ్చినా అందరి తలలో నాలుకై మెలిగారు.ఉద్యమకాలంలో లాఠీ దెబ్బలు తిన్నా రైల్ రోకోలు చేసిన కేటీఆర్‌కే చెల్లింది.యువతలో కేటీఆర్‌కు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువే.

ఇక ఇప్పటికే… జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రెంట్ పేరుతో బిజీ అయ్యేందుకు చూస్తున్నాడు.అందులో బాగంగినే… తన కుమారుడికి కీలక బాధ్యతలు అప్పగించారు.వారసత్వం ఒక్కటే నాయకుడిగా నిలబెట్టలేదని చెప్పే కేటీఆర్‌… అధినేత అప్పగించిన పనిని విజయవంతం చేయడంలో దిట్ట.ఒకరకంగా చెప్పాలంటే తండ్రిని మించిన నాయకుడిగా అవుతాడు అనడంలో సందేహమే లేదు.

జాతీయ రాజకీయాలే తన టార్గెట్‌ అంటూ చెప్పుకొస్తున్న కేసీఆర్ ఇప్పుడు కేటీఆర్‌కు బాధ్యతలు అప్పగింతతో మరింత ఎక్కువ సమయం జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టేందుకు వీలు కుదురుతుంది.గులాభీ పార్టీలో కొత్త బాధ్యతలు చేపట్టిన కేటీఆర్ తమ పార్టీ కారును తండ్రి స్పీడ్ ను మించి మరింత స్పీడ్ గా ముందుకు తీసుకెళ్తాడు అనడంలో సందేహమే లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube