టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత పెళ్లి తరువాత ఎలాంటి సినిమాలు చేస్తూ దూసుకుపోతుందో అందరికీ తెలిసిందే.ఇప్పటికే ‘ఫ్యామిలీ మ్యాన్ 2’తో సమంత ఎలాంటి క్రేజ్‌ను దక్కించుకుందో మనం చూశాం.
ఇక ప్రస్తుతం ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ అనే మైథలాజికల్ మూవీలో నటిస్తోంది.ఈ సినిమాలో సమంత పాత్ర మునుపెన్నడూ లేని విధంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు గుణశేఖర్ ప్లాన్ చేస్తున్నాడు.
కాగా సమంతపై ఇప్పుడు ఓ స్టార్ హీరో కన్నేశాడట.
నేచురల్ స్టార్ నాని వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండటమే కాకుండా నిర్మాతగా కూడా తనదైన సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు నాని ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో సమంతను తీసుకునేందుకు నాని రెడీ అవుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
అయితే ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా, ఈ సినిమాను ఎవరు తెరకెక్కిస్తారా అనే అంశాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.కాగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నాని కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది.
మొత్తానికి సమంత లాంటి స్టార్ హీరోయిన్‌తో నాని లాంటి మంచి టేస్ట్ ఉన్న నిర్మాత కూడా ఓ సినిమా చేసేందుకు ఆసక్తిని చూపుతుండటంతో ఈ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక నాని ప్రస్తుతం టక్ జగదీష్, శ్యామ్ సింఘ రాయ్ లాంటి సినిమాలను రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే.
మరి నాని ప్రొడ్యూస్ చేయబోయే సినిమాలో సమంత నటిస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఏదేమైనా సమంత గనక ఈ సినిమాలో నటిస్తే, ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని నాని గట్టిగా నమ్ముతున్నాడు.