భారత్ భవిష్యత్తులో రెండో ఆర్థిక వ్యవస్థగా ఎదగనుంది.దీనిపై ప్రపంచ ప్రఖ్యాత సంస్థ తాజాగా నివేదిక వెల్లడించింది.2075 నాటికి జపాన్, జర్మనీ మాత్రమే కాకుండా అమెరికాను( America ) కూడా వెనక్కి నెట్టి భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని గోల్డ్‌మన్ శాచ్స్( Goldman Sachs ) తన తాజా నివేదికలో పేర్కొంది.ప్రస్తుతం, జర్మనీ, జపాన్, చైనా, యుఎస్ తర్వాత భారతదేశం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది.
ఆవిష్కరణ, సాంకేతికత, అధిక మూలధన పెట్టుబడి, పెరుగుతున్న కార్మిక ఉత్పాదకత రాబోయే సంవత్సరాల్లో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సహాయపడతాయని గోల్డ్‌మన్ శాచ్స్ పేర్కొంది.
ఈ సంస్థ రీసెర్చ్‌పై భారత ఆర్థికవేత్త శంతను సేన్‌గుప్తా మాట్లాడారు.“భారతదేశ డిపెండెన్సీ నిష్పత్తి రాబోయే రెండు దశాబ్దాలలో ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలలో అత్యల్పంగా ఉంటుంది.” డిపెండెన్సీ రేషియో మొత్తం పని చేసే వయస్సు జనాభాపై ఆధారపడిన వారి సంఖ్యతో కొలుస్తారు.రాబోయే 20 ఏళ్లలో పెద్ద ఆర్థిక వ్యవస్థలపై భారత్ ఆధారపడే నిష్పత్తి తగ్గుతుందని ఆయన అన్నారు.“కాబట్టి భారతదేశం తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, సేవలను వృద్ధి చేయడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కొనసాగించడానికి ఇది నిజంగా సరైన సమయం” అని ఆయన అభిప్రాయపడ్డారు.
మాన్యుఫ్యాక్చరింగ్, సర్వీసెస్‌లో ప్రైవేట్ రంగం స్కేల్( Private sector ) పెంచుకోవడానికి ఇది సరైన సమయమని గోల్డ్‌మన్ శాచ్స్ నివేదికలో పేర్కొంది.ఇది దేశంలో మరిన్ని ఉద్యోగాలను సృష్టించేందుకు, పెద్ద శ్రామిక శక్తిని సక్రమంగా ఉపయోగించుకోవడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది.భారత వృద్ధికి మూలధన పెట్టుబడి మరో ముఖ్యమైన చోదకమని గోల్డ్‌మన్ శాచ్స్ అంచనా వేసింది.గత 15 ఏళ్లుగా భారతదేశంలో శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు తగ్గుముఖం పట్టిందని నివేదిక పేర్కొంది.
మహిళల శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు పురుషులతో పోలిస్తే “గణనీయంగా తక్కువగా ఉంది”, “అందరూ పని చేసే వయస్సు గల స్త్రీలలో 20% మాత్రమే భారతదేశంలో ఉపాధి పొందుతున్నారు” అని పేర్కొంది.ఆర్థిక ప్రమాణాలకు అనుగుణంగా లేని పనిలో ప్రధానంగా మహిళలు నిమగ్నమై ఉండటం వల్ల ఈ తక్కువ సంఖ్య ఏర్పడిందని నివేదిక పేర్కొంది.
భారతదేశం కరెంట్ ఖాతా లోటులో ఉన్నందు వల్ల నికర ఎగుమతులు కూడా భారతదేశ వృద్ధికి అవరోధంగా ఉన్నాయని గోల్డ్‌మన్ శాచ్స్ పేర్కొంది.