ట్రాఫిక్‌లో చిక్కుకున్నా బాధ పడలేదు.. కారులోనే కూరగాయలు తరిగేసింది!

హైదరాబాద్ ట్రాఫిక్ గురించి జనాలకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఓ అరగంట పడుతుందన్న ప్రయాణానికి ఈ సిటీలో దాదాపు గంటన్నర పడుతున్న పరిస్థితి వుంది.

 Bengaluru Woman Peels Veggies While Stuck In Traffic Details, Car, Vegetables, C-TeluguStop.com

ఇక ఇక్కడ అలావుంటే బెంగళూరు ( Bengaluru ) పరిస్థితి అయితే అంతకుమించి అనుకోవచ్చు.ఇక్కడ గాని ఒక్కసారి ట్రాఫిక్‌ లో ఇరుక్కుంటే ఎప్పుడు ఇంటికి వెళ్తామో చెప్పలేము.

ఆ ట్రాఫిక్ క్లియర్ అయ్యే లోపు మనం చాలా పనులు చేసుకోవచ్చు అని లోలోపల ఫీల్ అవడం ఖాయం.సరిగ్గా ఇలాగే అనుకున్న ఓ మహిళా సమయాన్ని వృధా చేయడం ఎందుకని ట్రాఫిక్( Traffic ) క్లియర్ అయ్యే లోపు తన కారులోని కూర్చని చక్కగా కూరగాయలను తరిగేసుకుంది మరి.

అవును, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్ గా మారింది.బెంగళూరుకు చెందిన ప్రియా( Priya ) అనే మహిళా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి ఈ పని చేసినట్టు తెలుస్తోంది.కాగా నెటిజన్లు ఆ వీడియోపైన ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.గతంలో ఒక వ్యక్తి ట్రాఫిక్‌లో ఉన్న కూడా తన భోజనాన్ని పూర్తి చేసిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే.ట్రాఫిక్‌ సమస్య వల్ల బెంగళూరు నగరానికి ఏటా రూ.19,725 కోట్లు నష్టం వాటిల్లుతోందని కూడా ఒక సర్వేలో వెల్లడైంది.

ఆమె చర్యలను చాలామంది నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.కొంతమంది ‘అయ్యో రామా! ట్రాఫిక్ లో సమయం వృధా అయిపోతుందని మేము చాలాసార్లు బాధపడ్డాం గాని ఇలా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తోందండి!’ అంటూ కామెంట్స్ చేశారు.మరికొంతమంది స్పందిస్తూ… ‘మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ ఆండీ!’ అని కామెంట్ చేయగా ఇంకొంతమంది ‘భలే ఐడియా అండి, మేము కూడా ఈసారి కారులో వెళ్ళేటప్పుడు కూరగాయలను( Vegetables ) వెంటేసుకొని పోతాం’ అని రాసుకొచ్చారు.

కాగా ఇప్పటికీ ఈ వీడియోని లక్షల్లో వీక్షించడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube