తెలంగాణలో ఫోన్ టాపింగ్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది.కాంగ్రెస్ బీఆర్ఎస్, బిజెపిల మధ్య దీనిపైనే విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా ఈ కేసులో మంత్రి కేటీఆర్ ( Minister KTR )ను టార్గెట్ చేసుకుని కాంగ్రెస్, బిజెపిలు విమర్శలతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో, కేటీఆర్ కొంతమందికి లీగల్ నోటీసులు పంపడం వంటివి దుమారాన్ని రేపాయి తాజాగా ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి( Minister Kishan Reddy ) బీఆర్ఎస్ పార్టీని రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తుండడంతో రాజకీయంగా ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.
ఇప్పటికే కేటీఆర్ పై విమర్శలు చేసిన వారికి ఆయన లీగల్ నోటీసులు పంపడంతో, నోటీసులు అందుకున్న వారు కేటీఆర్ ను టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
![Telugu Congress, Kishan Reddy, Telangana, Phoneordinary-Politics Telugu Congress, Kishan Reddy, Telangana, Phoneordinary-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/04/The-phone-tapping-case-is-not-an-ordinary-political-scandalc.jpg)
కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ( MLA Yennam Srinivas Reddy )లీగల్ నోటీసులతో తనను బెదిరించాలని చూస్తున్నారని ఆరోపించారు.తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ,దీనికి బాధ్యులు ఎవరో తేల్చాలని బిజెపికి తాను ఫిర్యాదు చేస్తే పరువు తీసినట్టా అని యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు.కేటీఆర్ రెచ్చిపోయి నోటీసులు పంపారని, విచారణ ఎందుకు చేస్తున్నారని బిజెపికి కూడా నోటీసులు పంపాలన్నారు శ్రీనివాస్ రెడ్డి.
అలాగే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఇక బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా రద్దు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.
![Telugu Congress, Kishan Reddy, Telangana, Phoneordinary-Politics Telugu Congress, Kishan Reddy, Telangana, Phoneordinary-Politics](https://telugustop.com/wp-content/uploads/2024/04/The-phone-tapping-case-is-not-an-ordinary-political-scandala.jpg)
అప్పట్లో షాడో సీఎం మాదిరిగా కేటీఆర్ వ్యవహరించి, నేడు తెలియదంటే ఎలా అని కిషన్ రెడ్డి ( Kishan Reddy ) ప్రశ్నించారు.మరోవైపు కేంద్రంలో బిజెపి, ఈడి రాష్ట్రంలో కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ కేసును వాడుకుని బిఆర్ఎస్ ను ఇరుకును పెట్టాలని చూస్తున్నాయని ఆ పార్టీ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై మంత్రి కొండా సురేఖ, కేకే మహేందర్ సైతం స్పందించారు.
నోటీసుల విషయంలో ఎవరిని క్షమాపణ అడిగే ప్రసక్తే లేదని, ఏదైనా ఉంటే లీగల్ గానే తాము పోరాటం చేస్తామని వారు ప్రకటించడంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాబోయే రోజుల్లో మరింత రచ్చ చేసేలా కనిపిస్తోంది.