హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం( Uppal Stadium ) వేదికగా జరగనున్న క్రికెట్ మ్యాచ్ నేపథ్యంలో బ్లాక్ టికెట్ల( Black Tickets ) దందా సాగుతోంది.ఈ మేరకు టికెట్ల విషయంలో హెచ్సీఏ( HCA ) తీరుపై మరోసారి అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారని హెచ్సీఏపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు బ్లాక్ టికెట్ల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా ఒక్కో టికెట్ ధర పది రెట్లు ఎక్కువ పలుకుతుందని తెలుస్తోంది.రూ.వెయ్యి టికెట్ ధర కాగా రూ.6 వేలకు పైగా పలుకుతుంది.
ధోనీకి( Dhoni ) ఇదే చివరి ఐపీఎల్ మ్యాచ్ అని భావిస్తున్న అభిమానులు ఎంత ధర అయినా ధోనీని గ్రౌండ్ లో చూడాలని ఆరాటపడుతున్నారని తెలుస్తోంది.దీంతో ఇదే అదునుగా బ్లాక్ మార్కెట్ దందాను జోరుగా కొనసాగిస్తున్నట్లు సమాచారం.అయితే ఈ సీజన్ ఐపీఎల్ టికెట్ల( IPL Tickets ) అమ్మాకాన్ని పేటీఎంకు బీసీసీఐ అప్పగించింది.సైట్ లోకి రాకముందే బ్లాక్ మార్కెట్ లోకి టికెట్లు వెళ్లిపోయాయి.
దీంతో బ్లాక్ మార్కెట్ వెనుక పేటీఎం బుకింగ్ సిబ్బంది హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.