టాలీవుడ్ దర్శకుడు పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి నటిస్తున్న తాజా చిత్రం లైగర్.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చెయ్యాలి అని చిత్ర బృందం భావిస్తున్నారు.
ఇకపోతే పూరి జగన్నాద్ దర్శకత్వం వహిస్తున్న లైగర్ సినిమాకు ఛార్మి నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చిత్రబృందం ముంబైలో ఉన్నారు.

ముంబైలోని పరిసర ప్రాంతాల్లో ఈ సినిమాలో పలు సన్నివేశాలను చిత్రీకరించారు.లైగర్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఇక విజయ్ అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదల అవుతుందా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు.ఈ సినిమాతో విజయ్ బాలీవుడ్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారు.ఇదిలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కు సంబంధించిన ఒక వార్త చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే.

లైగర్ సినిమా విడుదలకు ముందే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ తో కలిసి మరొక ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకెళ్ల పోతున్నారు.ఆ ప్రాజెక్టును మార్చి 29 అనగా నేడు ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మిషన్ లాంచ్ అంటూ ప్రకటించిన కొద్దిసేపటికే విజయ్ దేవరకొండ తన పేరెంట్స్ అలాగే నిర్మాత ఛార్మి, దర్శకుడు పూరి జగన్నాథ్ లతో కలిసి ముంబైలో లంచ్ కోసం మీట్ అయ్యారు.ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్, ఛార్మి, తల్లిదండ్రులు కలిసి లంచ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అయితే పూరి జగన్నాథ్, దేవరకొండ కాంబినేషన్ లో నెక్స్ట్ సినిమా జన గణ మన నేడు ముంబైలో మొదలు కానున్నట్లు తెలుస్తోంది.

అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కించబోతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ఆ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా నేడు ముంబైలో మొదలు పెట్టబోతున్నారు అని సమాచారం.అందుకోసమే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ ముంబైలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.







