తమిళ స్టార్ హీరో కార్తి సరసన ‘బిర్యాని’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన మలయాళ హీరోయిన్ హనీ శివరాజ్ అంజని గత కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతోంది.చికిత్స పొందుతున్న ఈమె తుది శ్వాస విడిచింది.29 సంవత్సరాల శివరాజ్ అంజని చనిపోవడంతో తమిళ మరియు మలయాళ సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.పలు సినిమాల ద్వారా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె జీవితం ఇలా అర్థాంతరంగా ముగియడంతో కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు, స్నేహితులు దుఖ:లో మునిగి పోయారు.‘బిర్యాని’ దర్శకుడు వెంకట్ ప్రభు శివరాజ్ అంజని ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ఇంకా పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఘనంగా నివాళి అర్పించారు.







