సినిమా ఇండస్ట్రీ లో రైటర్ అంటే ఎప్పటి నుంచో అందరికి చిన్న చూపు ఉంది అందుకే ఇండస్ట్రీ లో వర్క్ చేస్తున్న ఏ రైటర్ కూడా హ్యాపీ గా ఉండడు.అయితే అప్పట్లో ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న కొరటాల శివ ఆయన రైటర్ గా ఉన్నప్పుడు ఎదురుకున్న ఇబ్బందుల గురించి చెప్పాడు అవేంటంటే… కొరటాల శివ కూడా ఆయన కెరియర్ స్టార్టింగ్ లో రైటర్ గా చేసారు అప్పుడు ఆయన ఒక డైరెక్టర్ దగ్గర చాలా ఇబ్బందులను ఎదురుకున్నారట,ఒక సినిమాకి ఆయన కథ మాటలు ఇస్తే ఆ డైరెక్టర్ కథ కి నా పేరు వేయించుకుంటా డైలాగ్స్ కి నీపేరు వేయిస్తా అని చెప్పారట.
ఇక చేసేది ఏం లేక ఒప్పుకున్నాడట.

ఆయనతో చేసిన ఇంకో సినిమాకి కూడా సేమ్ ముందు సినిమాలాగే కథ నాది మాటలు నివి అని టైటిల్ వేయిస్తా అన్నాడట దానికి విపరీతమైన కోపానికి వచ్చిన కొరటాల వాళ్ళు చెప్పిన దానికి ఒప్పుకోలేదట నేను రాసుకున్న కథ కి నీ పేరు ఎలా వేయించుకుంటావ్ అని గొడవ పెట్టుకున్నాడట ఆ గొడవ జరిగిన తర్వాత కొరటాల గారు అక్కడి నుంచి కోపం గా స్టోరీ డైలాగ్స్ రెండింటిలో నాపేరు వేస్తె వేయండి లేకపోతే మొత్తానికే తీసేయండి అని చెప్పి బయటికి వచ్చారట ఆ సినిమా డైరెక్టర్ కథ మాటలు దేంట్లో కూడా కొరటాల పేరు వేయకుండా ఆయన ఒక్కడి పేరు మాత్రమే వేయించుకున్నాడట.

ఇంతకు ఆ డైరెక్టర్ ఎవరనేది ఆయన రివీల్ చేయలేదు,ఆయన గురించి అడిగితే వాడి గురించి చెప్పడం అవసరం లేదు వాడి పాపాన వాడే పోతాడు అని చెప్పాడు అలాగే వాడి మీద కోపం తోనే నేను డైరెక్టర్ అయ్యాను అని కూడా చెప్పారు.అలా కొరటాల డైరెక్టర్ అయి మంచి సినిమాలు తీసి ఇండస్ట్రీ లో ఒక స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు.ప్రస్తుతం ఎన్టీయార్ తో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ప్రస్తుతం అది షూటింగ్ దశలో ఉంది అలాగే ఈ ప్రాజెక్ట్ తరువాత అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు కొరటాల…
.






