తెలంగాణ హైకోర్టులో సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ దాఖలైంది.ఈనెల 16న సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుంది.
అయితే మాజీమంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీల్ యాదవ్ ఏ2 నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ సునీల్ యాదవ్ ఈనెల 6న పిల్ వేసిన సంగతి తెలిసిందే.
దీనిపై జస్టిస్ సీహెచ్ సుమలత ధర్మాసనం విచారించనుంది.కాగా ఈ కేసు విచారణను ఇటీవలే సుప్రీంకోర్టు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు బదిలీ చేసిన విషయం తెలిసిందే.