తెలంగాణలో బీజేపీ రోజురోజుకు బలపడుతున్న వేల టీఆర్ఎస్ కు బీజేపీ దూకుడు ఇబ్బందిగా మారింది.టీఆర్ఎస్ పై బీజేపీ నాయకులు మాటల తూటాలు పేల్చుతూ రోజురోజుకు బలంగా తయారవుతున్నారు.
కాని టీఆర్ఎస్ కు స్వంత పార్టీ నేతల వ్యవహారశైలితో ఇబ్బందులు తప్పడం లేదు.బీజేపీని విమర్శిస్తూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి.
తాజాగా గంగపుత్రులపై మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి.గంగపుత్రుల వృత్తి చేపలు పట్టడం కాదు అన్న మంత్రి తలసాని వ్యాఖ్యలతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గంగపుత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
మేము ఏమి వృత్తి చేస్తామో మంత్రి తలసాని ప్రజలను ఆడగాలని వారు తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా నిరసన తెలిపారు.ఎవరు ఏమి వృత్తి చేస్తారో తెలియని మంత్రి తలసానిని మంత్రి వర్గం నుండి తొలగించాలని గంగపుత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా ఈ వివాదంపై మంత్రి తలసాని స్పందిస్తూ నా మాటలు వక్రీకరించారని, ఇప్పటికే గంగపుత్రులకు క్షమాపణలు తెలియజేశానని మంత్రి తలసాని అన్నారు.ఏది ఏమైనా టీఆర్ఎస్ నేతల మాటలే కేసీఆర్ ను ఇరుకున పెట్టేలా ఉండడం టీఆర్ఎస్ నేతలు ఆలోచించుకోవలసిన విషయం.