తెలుగు చిత్ర పరిశ్రమలో జీవిత రాజశేఖర్ దంపతుల గురించి వారి నటన జీవితం గురించి అందరికీ సుపరిచితమే.అయితే తాజాగా జీవిత రాజశేఖర్ చిన్న కుమార్తె శివాత్మిక హర్ష పులిపాక దర్శకత్వంలో వచ్చిన పంచతంత్రం అనే సినిమాలో నటించారు.
ఈ సినిమా డిసెంబర్ 9వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక ఈ సినిమా కార్యక్రమాలలో భాగంగా మీడియా సమావేశంలో మాట్లాడిన జీవిత తన కుమార్తెల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
చిన్నప్పటి నుంచి మా పిల్లలు శివాని శివాత్మిక సినిమాల్లోనే పెరిగారు.వాళ్లు పెరిగి పెద్దయిన తర్వాత సినిమాలలోకి వస్తారని మేము అనుకోలేదు.అయితే మేము కూడా సినిమాలలోకి వెళ్తామని చెప్పినప్పుడు అందరి తల్లిదండ్రులలాగే మాలో కూడా కాస్త భయం మొదలైందని తెలిపారు.సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలంటే అంత సులభమైన విషయం కాదు.
ఇండస్ట్రీలో కొనసాగాలంటే మంచి పాత్రలు రావాలి మంచి పాత్రలను మనం కొనలేము కదా అని ఈమె తెలిపారు.

చిన్నప్పటినుంచి పిల్లల కోసం ఎంతో కష్టపడ్డాం వాళ్ళు ఏం అడిగినా కాదనలేదు వాళ్ల కోసం ఆస్తులు కూడా అమ్ముకున్నామని ఈమె ఎమోషనల్ అయ్యారు.అలాంటిది వీళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఇండస్ట్రీలోకి వస్తామంటే తమలో కూడా చిన్న భయం కలిగిందని తెలిపారు.మంచి పాత్రలు రావడం రాకపోవడం అనేది మన చేతుల్లో లేదు కానీ ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత మా సపోర్ట్ తప్పకుండా ఉంటుందని, ఏం జరిగినా నిరాశ పడకూడదని వారికి తెలియజేశామని జీవిత వెల్లడించారు.