బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం 14 వ వారం ముగింపు దశకు చేరుకుంది.14వ వారం పూర్తి కావడంతో ఈ వారం ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ కానున్నారు అని విషయం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.అయితే సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్నటువంటి ఇనయ ఎలిమినేట్ అయిందని వార్తలు బలంగా వినపడుతున్నాయి.మొదటినుంచి ఎంతో చాకచక్యంగా టాస్కులు ఆడుతూ ప్రతి ఒక్కరితో వాదనకు దిక్కుతూ రోజు రోజుకు తన గ్రాఫ్ పెంచుకుంటూ వచ్చిన ఈమె కచ్చితంగా టాప్5 లో ఉంటుందని అందరూ భావించారు.
ఇకపోతే ఈ వారం నామినేషన్ లో ఉన్నటువంటి వారిలో వీక్ కంటెస్టెంట్ గా ఉన్నటువంటి శ్రీ సత్య రోహిత్ కీర్తిఈ ముగ్గురిలో ఎవరో ఒకరు బయటకు వెళ్తారని భావించారు.అయితే ఊహించని విధంగా ఈ వారం బిగ్ బాస్ నుంచి ఇనయ బయటకు వెళ్ళనున్నారని తెలుస్తుంది.
ఇకపోతే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని వార్తలు కూడా వినపడుతున్నాయి.ఈ క్రమంలోనే డబల్ ఎలిమినేషన్ కనుక ఉంటే ఇనయతో పాటు మరో కంటెస్టెంట్ కూడా బయటకు వెళ్లాల్సి ఉంటుంది.

ఇక ఓటింగ్ లో చాలా లీస్ట్ పొజిషన్లో శ్రీ సత్య ఉండడంతో ఇనయతో పాటు శ్రీ సత్య కూడా హౌస్ నుంచి బయటకు వెళ్తారని వార్తలు వినపడుతున్నాయి మరి నిజంగానే ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉందా? డబల్ ఎలిమినేషన్ ఉన్నప్పటికీ ఇనయ, శ్రీ సత్య బయటకు వెళ్తారా లేదా అనే విషయం తెలియాలంటే మరి కొన్ని గంటలు వేచి చూడాలి.ఇక టాప్ ఫైవ్ లోకి ఇప్పటికే శ్రీహన్ చేరుకున్న విషయం మనకు తెలిసిందే.ఇక ఈ సీజన్ టైటిల్ రేస్ లో రేవంత్ శ్రీహన్ మధ్య కొనసాగుతూ ఉండగా ఎక్కువగా రేవంత్ టైటిల్ విన్నర్ అవుతారని ఇప్పటికే వార్తలు వైరల్ అవుతున్నాయి.