వారంలో ఒక్క‌సారి ఇలా చేస్తే న‌ల్ల‌టి పాదాలు తెల్ల‌గా మెరిసిపోవ‌డం ఖాయం!

శరీరంలో బయటకు కనిపించే భాగాల్లో పాదాలు కూడా ఒకటి.కానీ, చాలా మంది బిజీ లైఫ్ స్టైల్ కార‌ణంగా పాదాల‌పై పెద్ద‌గా శ్ర‌ద్ధ చూపించ‌రు.

స్నానం చేసే స‌మ‌యంలో ఏదో కాస్త స‌బ్బును పాదాల‌కు రుద్దుతారు త‌ప్పా.మ‌రే జాగ్ర‌త్త‌లు తీసుకోరు.

దాంతో మృత క‌ణాలు, మురికి పేరుకుపోయి పాదాలు న‌ల్ల‌గా, అందవిహీనంగా మారిపోతుంటాయి.అయితే స‌మ‌యం లేని వారు ఇప్పుడు చెప్ప‌బోయే సింపుల్ హోమ్ రెమెడీని వారంలో ఒక్క‌టంటే ఒక్క‌సారి ప్ర‌య‌త్నిస్తే గ‌నుక‌.

చాలా సుల‌భంగా న‌ల్ల‌టి పాదాల‌ను తెల్ల‌గా, అందంగా మెరిపించుకోవ‌చ్చు.మ‌రి ఆ హోమ్ రెమెడీ ఏంటో లేట్ చేయ‌కుండా కింద‌కు ఓ లుక్కేసేయండి.

Advertisement

ముందుగా పీల్ తీసిన‌ ఒక చిన్న బీట్ రూట్ తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసి ర‌సాన్ని వేరు చేసుకోవాలి.ఇప్పుడు బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు మీరు వాడే రెగ్యుల‌ర్ షాంపూను వేయాలి.

ఆ త‌ర్వాత వ‌న్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడ‌ర్‌, చిటికెడు క‌స్తూరి ప‌సుపు, మూడు టేబుల్ స్పూన్ల కాఫీ పౌడ‌ర్‌, నాలుగైదు స్పూన్ల బీట్ రూట్ జ్యూస్ వేసి బాగా మిక్స్ చేయాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని రెండు పాదాల‌పై అప్లై చేసి ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.ఆ త‌ర్వాత అర నిమ్మ చెక్కను తీసుకుని పాదాల‌ను స్మూత్‌గా రుద్దుతూ గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఆపై త‌డి లేకుండా ట‌వ‌ల్‌తో క్లీన్ చేసుకుని మంచి మాయిశ్చ‌రైజ‌ర్‌ను పాదాల‌కు పూయాలి.

ఇలా వారంలో ఒక్క‌సారి చేస్తే మురికి, మృత‌క‌ణాలు తొల‌గిపోయి పాదాలు తెల్ల‌గా, అందంగా మ‌రియు మృదువుగా త‌యారు అవుతాయి.కొన్ని సార్లు ఎండ‌ల కార‌ణంగా పాదాలు ట్యాన్ అవుతుంటాయి.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

అయితే పైన చెప్పిన రెమెడీని పాటిస్తే ట్యాన్ స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

Advertisement

తాజా వార్తలు