కొన్ని గ్రీన్ కార్డుల ప్రాసెసింగ్‌ను నిలిపివేసిన ట్రంప్ .. భారతీయులపై ప్రభావమెంత?

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇమ్మిగ్రేషన్ విధానంలో సమూల మార్పులు చేస్తూ వస్తున్నారు డొనాల్డ్ ట్రంప్.

( President Donald Trump ) ఇప్పటికే దేశంలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను పెద్ద ఎత్తున అమెరికా నుంచి బహిష్కరిస్తున్నారు.

అలాగే హెచ్ 1 బీ వీసాల( H1-B Visa ) విధానంలోనూ సంస్కరణలు తీసుకొస్తున్నారు ట్రంప్.

తాజాగా కొన్ని గ్రీన్ కార్డ్ దరఖాస్తులను( Green Card Applications ) ట్రంప్ పరిపాలనా యంత్రాంగం నిలిపివేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ట్రంప్ సంతకం చేసిన రెండు కార్యనిర్వాహక ఉత్తర్వుల కారణంగా స్టేటస్ దరఖాస్తుల సర్దుబాటు అని పిలవబడే కొన్నింటిపై ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) అధికారి ఒకరు అన్నారు.

"""/" / దీనిపై నేషనల్ ఇమ్మిగ్రెంట్ జస్టిస్ సెంటర్ డైరెక్టర్ ఆఫ్ పాలసీ ఆజాదే ఎర్ఫానీ మీడియాతో మాట్లాడుతూ.

గ్రీన్‌కార్డ్ ప్రాసెసింగ్‌పై ఈ భారీ నిరవధిక నిలిపివేత అన్ని రకాల వలసదారులను జాతీయ భద్రతా ప్రమాదంగా చిత్రీకరించడానికి ట్రంప్ పరిపాలన యంత్రాంగం చేస్తున్న మరో ప్రయత్నం అన్నారు.

ఈ విరామం వల్ల వేల మంది దరఖాస్తుదారులకు శాశ్వత నివాసం కోసం మరింత సమయం వేచి ఉండాల్సి రావొచ్చు.

తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే లక్షలాది మంది అక్రమ వలసదారులను( Illegal Migrants ) బహిష్కరిస్తానని ట్రంప్ శపథం చేశారు.

వాస్తవానికి నేర చరిత్ర లేని వ్యక్తులను కూడా చేర్చి ఈ సంఖ్యను మరింత పెంచవచ్చని కొంతమంది న్యాయవాదులు భయపడుతున్నారు.

"""/" / ఈ పరిణామాలు భారతీయ వలసదారులతో సహా అనేక మందిని ఆందోళనకు గురిచేస్తున్నాయి.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో వలసదారులకు మూలం భారతదేశమే.2023 నాటికి 2.

9 మిలియన్లకు పైగా భారతీయ వలసదారులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నివసిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

అమెరికాలో 1960ల నుంచి భారతీయ జనాభా నిరంతరాయంగా, గణనీయంగా పెరిగింది.2000 నుంచి 2023 మధ్య అత్యధికంగా అమెరికాకు భారతీయ వలసలు జరిగాయని నిపుణులు చెబుతున్నారు.

ఏ దరఖాస్తులు ప్రభావితమయ్యాయో, ఎంతకాలం విరామం ఉంటుందో స్పష్టత రాలేదు.అయితే శరణార్ధులు, అమెరికాలో ఆశ్రయం పొందినవారికి సంబంధించిన ప్రక్రియతో పాటు ఒక పరిశీలన జరుగుతోంది.