ఐపీఎల్ 16వ సీజన్( IPL 16 ) మొదలవ్వడానికి కొన్ని గంటలు మాత్రమే మిగిలి వున్నాయి.తొలి మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్, 4 సార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మంచి పోటాపోటీగా జరగనుంది.
దాదాపు 2 నెలల పాటు క్రికెట్ అభిమానులను ఖుషి చేయడానికి ఈ 31న ఈ ధనాధన్ లీగ్ మన ముందుకు రానుంది.ఇప్పటికే ఐపీఎల్ 16వ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను బీసీసీఐ విడుదల చేసిన సంగతి విదితమే.
సన్ రైజర్స్ హైదరాబాద్( Sun Risers Hyderabad ) తమ కొత్త కెప్టెన్ ను కూడా ప్రకటించింది.ఐపీఎల్ 16వ సీజన్ లో సన్ రైజర్స్ ను సౌతాఫ్రికా స్టార్ మార్కరమ్ ( Markram ) నడిపించనున్నాడు.
ఇపుడు అదేవిధంగా మిగిలిన 9 జట్ల కెప్టెన్లు ఎవరో కూడా తేలిపోయింది.ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కు( David Warner ) ఢిల్లీ పగ్గాలు అప్పగించారు.ఎందుకంటే రిషభ్ పంత్ కారు ప్రమాదం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకున్న సంగతి విదితమే.ఇక వైస్ కెప్టెన్ గా టీమిండియా యువ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను ఎంపిక చేసినట్లు భోగట్టా.
ఇక ఐపీఎల్ 15వ సీజన్ టోర్నీలో కోల్‌కతా నైత్ రైడర్స్ కెప్టెన్‌గా ఉన్న శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా జట్టుకు దూరమైన కారణంగా అతని స్థానంలో జట్టులోని నితిష్ రాణాను( Nitish Rana ) కెప్టెన్‌గా నియమించింది టీమ్ ఫ్రాంచైజీ.
డేవిడ్ వార్నర్ అనుభవం రిత్యా అతడికే కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలనే నిర్ణయానికి ఢిల్లీ వచ్చేసింది.దేశవాళి క్రికెట్ లో ముంబై రంజీ జట్టుకు కెప్టెన్ గా ఉన్న పృథ్వీ షాను కాదని అక్షర్ పటేల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడం విశేషం.కింద ఇవ్వబడిన లిస్టుని ఖరారు చేయడం జరిగింది.
1.రోహిత్ శర్మ- ముంబై ఇండియన్స్
2.ఎంఎస్ ధోని- చెన్నై సూపర్ కింగ్స్
3.ఫాఫ్ డు ప్లెసిస్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
4.హార్దిక్ పాండ్యా- గుజరాత్ టైటాన్స్
5.కేఎల్ రాహుల్ – లక్నో సూపర్ జెయింట్స్
6.సంజు శాంసన్- రాజస్థాన్ రాయల్స్
7.శిఖర్ ధావన్- పంజాబ్ కింగ్స్
8.డేవిడ్ వార్నర్- ఢిల్లీ క్యాపిటల్స్
9.ఐడెన్ మార్క్రామ్ – సన్‌రైజర్స్ హైదరాబాద్
10.నితీష్ రాణా – కోల్‌కతా నైట్ రైడర్స్
.