జనసేన నాయకుడు, మెగా బ్రదర్ నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.తన ఓటును ఏపీకి మార్చుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ ఎన్నికల్లో తాను గానీ, తన భార్య గానీ ఓటు వేయలేదని నాగబాబు పేర్కొన్నారు.ఎన్నికల స్ఫూర్తిని పోగొట్టవద్దని ఓటు వేయలేదని తెలిపారు.
కానీ కొందరు పనికిమాలిన ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తనకు పదవులపై ఎలాంటి కోరికలు లేవన్న నాగబాబు జనసేన పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు.
ఈ క్రమంలోనే బీజేపీ పట్ల తమ వైఖరి పాజిటివ్ గానే ఉంటుందని స్పష్టం చేశారు.తమతో బీజేపీ కూడా కలిసి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ప్రతిపక్షమే ఉండకూడదనుకోవడం సరికాదన్నారు.ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రతిపక్షం ఖచ్చితంగా ఉండాల్సిందేనని తెలిపారు.